ఇంటింటా అమరావతి నినాదం

ABN , First Publish Date - 2020-06-04T08:56:37+05:30 IST

మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఇంటింటా ..

ఇంటింటా అమరావతి నినాదం

169వ రోజు కొనసాగిన రాజధాని రైతుల ఆందోళనలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడికొండ, జూన్‌ 2: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఇంటింటా మహిళలు, రైతులు నినదించారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తోన్న ఆందోళనలు బుధవారానికి 169వ రోజుకు చేరాయి. రాజధాని 29 గ్రామాల రైతులు, కూలీలు, మహిళలు బృందాలుగా ఏర్పడి ఇళ్ల ముందు అరుగులపై కూర్చొని పచ్చ జెండాలు మోడలో వేసుకుని, రైతు చిహ్న జెండాలు చేభూని నిరసనలు కొనసాగించారు. సీఎం జగన్‌ నుంచి అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు తమపోరు ఆపమని స్పష్టం చేశారు.  అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో చేస్తున్న నిరసనలు బుధవారానికి 43వ రోజుకు చేరుకున్నాయి.  

Updated Date - 2020-06-04T08:56:37+05:30 IST