న్యాయం, ధర్మం.. అమరావతి వైపే

ABN , First Publish Date - 2021-05-11T09:29:53+05:30 IST

‘న్యాయం, ధర్మం మా వైపే ఉంది.. పోరాటాన్ని అణగదొక్కాలని చూస్తే అవే మిమ్ముల్ని నాశనం చేస్తాయి..’ అని అమరావతి రైతులు, మహిళలు తేల్చిచెప్పారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, రైతు కూలీలు

న్యాయం, ధర్మం.. అమరావతి వైపే

510వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు 


తుళ్లూరు, మే 10: ‘న్యాయం, ధర్మం మా వైపే ఉంది.. పోరాటాన్ని అణగదొక్కాలని చూస్తే అవే మిమ్ముల్ని నాశనం చేస్తాయి..’ అని అమరావతి రైతులు, మహిళలు తేల్చిచెప్పారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, రైతు కూలీలు, దళిత జేఏసీ నేతలు చేస్తున్న ఉద్యమం సోమవారంతో 510వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యమాన్ని అణచివేయాలని పాలకులు అనేక కుట్రలు చేశారని, అమరావతిని నిర్వీర్యం చేయాలని చూడడం దుర్మార్గమని అన్నారు. మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతిని గంగపాలు చేసిందన్నారు. సీఎం జగన్‌రెడ్డికి అమరావతి అంటేనే మంటన్నారు. విభజనతో అన్యాయమైన ఏపీ పాలన చేతకాని వారి చేతుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడు’తో నాశనం తప్పితే అభివృద్ధి ఉండదన్నారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.

Updated Date - 2021-05-11T09:29:53+05:30 IST