రాజధాని తరలింపు కుట్రే..

ABN , First Publish Date - 2020-08-03T18:56:09+05:30 IST

రాజధాని తరలిం పు కుట్రపూరితమని, అయితే ఇందుకు జిల్లా వైసీపీ నేతలు..

రాజధాని తరలింపు కుట్రే..

కొండపి ఎమ్మెల్యే స్వామి విమర్శ


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): రాజధాని తరలిం పు కుట్రపూరితమని, అయితే ఇందుకు జిల్లా వైసీపీ నేతలు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డి.బాలవీరాంజనేయస్వామి ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వైసీపీ వ్యవహారం చూ స్తుంటే దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. అమరావతిని కాదని రాజధానిగా వైజాగ్‌ ను ఏర్పాటు చేస్తే జిల్లా వైసీపీ నాయకులు సీఎం జగన్‌ ఫొటోలకు క్షీరాభిషేకం చేయడం విచి త్రంగా ఉందని, వారు ఎందుకు చేస్తున్నారో కూడా వారికి తెలి యని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రకాశం జిల్లాకు 170 కి.మీ దగ్గరలో ఉన్న రాజధానిని, 550 కి.మీ దూరంలో ఉన్న వైజాగ్‌కు మార్చినందుకు, హైకోర్టును 350 కి.మీ. దూరంలో ఉన్న కర్నూలుకు తరలిస్తున్నందుకు భవిష్యత్తులో జిల్లా ప్రజ లు పడే పాట్లు తలుచుకుని వైసీపీ నేతలు సంబరాలు చేసు కుంటున్నట్లు ఉందని ఆయన పేర్కొన్నారు.


జగన్‌ పతనానికి నాంది : ఎరిక్షన్‌బాబు

మూడు రాజధానుల నిర్ణయం జగన్మోహన్‌రెడ్డి పతనానికి నాంది అని లిడ్‌ క్యాప్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించా రు. నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం అందరి ఆమోద యోగ్యంతో అమరావతిని రాజధానిగా నిర్ణయంచారని, నాడు ఒప్పుకున్న ప్రతిపక్ష నేత నేడు సీఎం అ య్యాక మాట మార్చి మూడు ముక్కలు చేయడం దారుణమ న్నారు. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో 79 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు మానుుకోవాలని ఎరిక్షన్‌ బాబుహితవు పలికారు.


Updated Date - 2020-08-03T18:56:09+05:30 IST