హైకోర్టులో మూడో రోజు కొనసాగిన రాజధాని కేసుల విచారణ

ABN , First Publish Date - 2021-11-18T00:29:49+05:30 IST

హైకోర్టులో మూడో రోజు రాజధాని కేసుల విచారణ కొనసాగింది. రైతుల తరపున సుప్రీం కోర్టు సీనియర్‌ లాయర్‌ శ్యాందివాన్‌ వాదనలు వినిపించారు.

హైకోర్టులో మూడో రోజు కొనసాగిన రాజధాని కేసుల విచారణ

అమరావతి: హైకోర్టులో మూడో రోజు రాజధాని కేసుల విచారణ కొనసాగింది. రైతుల తరపున సుప్రీం కోర్టు సీనియర్‌ లాయర్‌ శ్యాందివాన్‌ వాదనలు వినిపించారు. జుడీషియల్‌ క్యాపిటల్‌ అంటే నిర్వచనం ఏమిటని ధర్మాసనం  ప్రశ్నించింది. అటువంటి పదమే లేదని సుప్రీం కోర్టు న్యాయవాది సురేష్‌ చెప్పారు. ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలు ప్రజల హక్కులకు.. భంగం కలిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని శ్యాందివాన్‌ చెప్పారు. మూడు రాజధానుల వల్ల మౌలిక సదుపాయాలు అభివృద్ది పూర్తిగా దెబ్బతిటుందని, అమరావతిని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని శ్యాం దివాన్‌ పేర్కొన్నారు. ఒకవైపు మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేయలేదంటూనే..మరోవైపు దానిని అమలు చేయకుండా నిలిపివేశారని తెలిపారు. భూ సమీకరణ ప్రక్రియను ఏకపక్షంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. చివరకు రైతులకు ఇచ్చిన ప్లాట్లకు కూడా విలువ లేకుండా చేశారని శ్యాం దివాన్‌ పేర్కొన్నారు. తన వాదనలకు మద్దతుగా అనేక కోర్టుల చారిత్రాత్మాక తీర్పులను శ్యాందివాన్ కోట్ చేశారు. కర్నూలులో హైకోర్టులో ఏర్పాటుకు ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదని సుప్రీం లాయర్‌ సురేష్ చెప్పారు. 

Updated Date - 2021-11-18T00:29:49+05:30 IST