‘క్వాపిటా’కు రూ.36 కోట్ల నిధులు

ABN , First Publish Date - 2021-04-21T06:36:16+05:30 IST

ప్రైవేట్‌ కంపెనీలు, స్టార్ట్‌పలకు ఈసాప్‌, క్యాప్‌ టేబుల్‌ సొల్యూషన్లను అందిస్తున్న క్వాపిటా 50 లక్షల డాలర్ల (దాదాపు రూ.36 కోట్లు) నిధులను సమీకరించింది...

‘క్వాపిటా’కు రూ.36 కోట్ల నిధులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రైవేట్‌ కంపెనీలు, స్టార్ట్‌పలకు ఈసాప్‌, క్యాప్‌ టేబుల్‌ సొల్యూషన్లను అందిస్తున్న క్వాపిటా 50 లక్షల డాలర్ల (దాదాపు రూ.36 కోట్లు) నిధులను సమీకరించింది. ప్రీ-సిరిస్‌ ఏ విడత కింద మాస్‌ మ్యూచువల్‌ వెంచర్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఎండి యా పార్టనర్స్‌, ఏంజిల్‌ ఇన్వెస్టర్లు ఈ నిధు లు సమకూర్చారు. 2020 సెప్టెంబరులో క్వాపిటా సీడ్‌ రౌండ్‌ నిధులను సమీకరించింది. హైదరాబాద్‌లో క్వాపిటాకు కార్యాలయం ఉంది. ప్రస్తుతం కంపెనీలో 30 మం ది నిపుణులు పని చేస్తున్నారని క్వాపిటా సీఈఓ రవి రావులపర్తి తెలిపారు. 

Updated Date - 2021-04-21T06:36:16+05:30 IST