అరెస్ట్‌లతో గొంతు నొక్కలేరు..

ABN , First Publish Date - 2021-10-21T05:43:16+05:30 IST

అరెస్టులతో గొంతును నొక్క లేరని ప్రభుత్వం, పోలీసుల తీరుపై కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ మండిపడ్డారు.

అరెస్ట్‌లతో గొంతు నొక్కలేరు..
ఓడీసీ పోలీసుస్టేషన్‌లో కందికుంట వెంకటప్రసాద్‌

మాజీ ఎమ్మెల్యే కందికుంట

ఓబుళదేవరచెరువు, అక్టోబరు 20:  అరెస్టులతో గొంతును నొక్క లేరని ప్రభుత్వం, పోలీసుల తీరుపై కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ మండిపడ్డారు. బుధవారం టీడీపీ రాష్ట్రబంద్‌ పిలుపు మేరకు ముందస్తు జాగ్రత్తగా కందికుంట వెంకటప్రసాద్‌ను కదిరిలో అరెస్టు చేసి, ఓడీసీ పో లీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకు వైసీపీ ఆగడాలు మితిమీరి పోతున్నా యన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబా బు నాయుడు ఇంటి పై దాడి, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఇంటి పై దాడులు జరిపించడం, మంగళగిరి లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. 

కదిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపైన, నాయకుల ఇళ్లపై న వైసీపీ గుండాలు చేసిన దాడికి నిరసనగా టీడీపీ చేపట్టిన రాష్ట్ర బంద్‌ను బుధవారం తెల్లవారుజా ము నుంచే పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున 5 గంటలకే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌  కందికుంట వెంకట ప్రసాద్‌ ఇంటిని పోలీసు బలగాలతో చుట్టుముట్టారు. ముగ్గురు సీఐలతో పాటు ఏఅర్‌ పోలీసులు, స్థానిక పోలీసులు వందమందికి పైగా ఇంటిముందు ఉండి భయానక వాతావరణాన్ని సృష్టించారు. సీఐలు సత్యబా బు, నిరంజ న్‌రెడ్డి, మధులు ఇంటిలోనే ఉండాలని కందికుంట ప్రసాద్‌ను కోరారు. దీనికి ఆయన ప్రజా స్వామ్యంలో నిరసన కూడా తెలపడానికి వీలు లేకుండా చేస్తున్నారని అందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి చేస్తే వారిని అరెస్టు చేయకుండా నిరసన తెలపడానికి వస్తున్న తమను అరెస్టు చేయడం అన్యాయనమన్నారు. డీజీపీ అధికార పార్టీ తొత్తుగా మారిపోయరన్నారు. అనంతరం ఇంటి బయ టకు వచ్చి నిరసన తెలిపారు. వెంటనే పోలీసు అధికా రులు అయనను అరెస్టు చేసి పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.   తెలుగు యువత జిల్లా అధ్యక్షడు బాబ్‌ జాన్‌, డైమండ్‌ ఇర్ఫాన్‌ లను తలుపులకు తరలించారు. అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిరసన తెలుపుతున్న రాజేంద్రనా యుడు, శేషు, గోపాల్‌ నాయుడు తదితరులను బల వంతంగా పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. బంద్‌ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు బండారు మనోహర్‌ నాయు డు, రాజశేఖర్‌ బాబు, గంగ య్యనాయుడు, ఇమ్రాన్‌, వడ్డే బాబు, కాటం మనోజ్‌, బశెట్టి మహేంద్ర, నాగప్ప, నాగరాజు, పాల రమణ, పీట్ల రమణమ్మ, ఉమాదేవి, గంగరత్నమ్మ తదితరులు పాల్గొ న్నారు.

దాడులకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి.. మాజీ మంత్రి పల్లె

పుట్టపర్తి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకార్యాయాలు నేతల నివాసాలపై వైసీపీ కార్యకర్తలు దాడిచేయడానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి క్షమా పణ చెప్పాలని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి ప్రకటన ద్వారా డిమాండు చేశారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర బంద్‌  నేపథ్యంలో టీడీపీ నాయకులను కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్ట్‌లు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్టీలకు వాటి కార్యాలయాలు దేవాలయాలతో సమా నమని అలాంటి కార్యాలయాలపై దాడిచేయడం నీచమై న చర్యని, దాడులు అన్నీ ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీకి ముందే తెలుసన్నారు. వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు కంటే పట్టాభి మాట్లాడిన మాటలు పెద్దవి కావని కేవలం రాష్ట్రంలో అలజడి సృష్టించి తె లు గుదేశం శ్రేణులను భయపెట్టాలనే అలోచనతోనే డా డులు జరిగాయన్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న అరాచ కపాలనపై ప్రజల దృష్టిని మరల్చాలనే ఇలాంటి వికృత క్రీడలకు ప్రభుత్వం తెగబడిందన్నారు. రాష్ట్రబంద్‌కు ప్రజల సంపూర్ణమద్దతు ఉందని దాన్ని నిర్వీర్యం చేయ డానికి పోలీసులను ఉపయోగించారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలు సరియైున సమ యంలో తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-10-21T05:43:16+05:30 IST