ఈ బాస్‌తో వేగలేం

ABN , First Publish Date - 2021-06-22T06:39:38+05:30 IST

ఆతనో మండలానికి ఇన్‌చార్జి ఎంపీడీవో. మహిళా సిబ్బందికి రాత్రి ఫోన్‌ చేసి ఎందుకు ఫోన్‌ చేశానో గుర్తు లేదంటారు. గట్టిగా నిలదీస్తే విధుల్లో భాగంగానే ఫోన్‌ చేశానని చెబుతారు.

ఈ బాస్‌తో వేగలేం

 పనిచేసే చోట సిబ్బందిపై వేధింపులు 

మిర్యాలగూడ, జూన్‌ 21 :ఆతనో మండలానికి ఇన్‌చార్జి ఎంపీడీవో. మహిళా సిబ్బందికి రాత్రి ఫోన్‌ చేసి ఎందుకు ఫోన్‌ చేశానో గుర్తు లేదంటారు. గట్టిగా నిలదీస్తే విధుల్లో భాగంగానే ఫోన్‌ చేశానని చెబుతారు. పోనీ సిన్సియర్‌గా ఆయన కార్యాలయ విధులు నిర్వహిస్తాడా అంటే అదీ లేదు. ఇప్పటికే గతంలో చేసిన తప్పులకు రెండు ఇంక్రిమెంట్లు కట్‌ అయ్యాయి. తప్పుడు సర్టిఫికెట్‌లతో విధుల్లో చేరాడనే అభియోగం ఎదుర్కొంటున్నాడు. తాను చెప్పేది వినేవరకు ప్రతీ విషయంలో కొర్రీలు పెడుతూ పై అధికారులకు ఫిర్యాదు చేసి కిందిస్థాయి సిబ్బందిపై తన జులుం ప్రదర్శిస్తున్నాడు. ఆ బాస్‌ వేధింపులు తట్టుకోలేక కిందిస్థాయి సిబ్బంది మూకుమ్మడిగా సెలవు లకు సిద్ధపడుతున్నారన్న విషయం తెలిసి, సదరు అధికారే పై అధికారుల తో చర్చించి వారి సెలవులను సైతం రద్దు చేసినట్లు సమాచారం.   

వేములపల్లి మండల ప్రజాపరిషత్‌ కార్యాల యంలో పని చేస్తున్న ఎంపీవోవో  ఇన్‌చార్జి ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తాను పనిచేసిన చోటల్లా అధికారాన్ని అడ్డుపెట్టుకుని సిబ్బందిని వేధించే వాడని విమర్శలున్నాయి. ఎంపీవోగా మండల పరిధిలోని ఓగ్రామ పంచాయతీ మహిళా సెక్రటరీకి రాత్రి  8 గంటలకు ఫోన్‌ చేసి ఎక్కడ ఉన్నారని కాల్‌ కట్‌ చేశారు.  మ రుసటి రోజు ఆ కార్యదర్శి కార్యాలయానికి వచ్చి రాత్రి ఎందుకు ఫోన్‌ చేశారు సార్‌ అని నిలదీస్తే ఏదో చెబుతామని అనుకు న్నా.. మరిచి పోయాను అని జారుకున్నాడు. కార్యాలయ సమయంలో కాకుండా ఇంటి వద్ద వున్న సమయంలో ఫోన్‌ చేయడమేమిటని అడిగినం దుకు ఆమెపై డ్యూటీ విషయంలో నిర్లక్ష్యం వహించిందని పై అధికారుల కు ఫిర్యాదు చేసి నోటీసులు ఇప్పించారనే ఆరోపణ ఉంది. పలువురు పంచాయ తీ కార్యదర్శులపై కూడా వేధింపులకు పాల్పడటంతో కార్యాలయ సిబ్బంది, కార్యదర్శులు మూకుమ్మడి సెలవులపై వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆల స్యంగా తెలియవచ్చింది. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వం రోజున కార్యాలయ సిబ్బంది ఇన్‌చార్జి ప్రవర్తనపై నిలదీయడంతో కార్యాలయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. కరోనా విపత్కర పరిస్థితిలో విధి నిర్వహ ణలో సిబ్బందిని సమన్వయ పర్చు కుంటూ విధులు నిర్వ హించాల్సింది పోయి తాను చెప్పింది వినడం లేదని స్టా్‌ఫ్‌పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో సీఈవో కార్యాలయానికి వచ్చి విచారించినట్లు తెలిసింది.

 అడ్డదారిన నియామకం..?

ఎంపీవోగా విధులు నిర్వహిస్తున్న అధికారి నియామకంపై పట్ల పలు ఆరోపణలు ఉన్నాయి. తగిన వయసు, విద్యార్హత లేకున్నా దొడ్డిదారిన ఉద్యోగంలోకి ప్రవేశించాడని ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 1966 లో పుట్టి 1981లో 15 ఏళ్ల వయసులోనే గ్రామపంచాయతీ బిల్‌కలెక్టర్‌గా నియామకం కావడం వెనుక లాలూచీ ఉందని పలువురు వ్యాఖ్యానిస్తు న్నారు. కనీస విద్యా అర్హత పదోతరగతి కాగా ఆయన ఉద్యోగంలో నియా మకమైన రెండేళ్లకు 1983లో ఎస్సెస్సీ పాస్‌అయినట్లు ధ్రువీకరించారు. 2001లో ఇతని ఉద్యోగ  నియామకం చట్టవిరుద్ధంగా ఉందని సర్పంచ్‌  వేతనాన్ని నిలిపివేయగా అడ్మినిష్ర్టేన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినతీరు, ఉద్యోగ నియామకం, పదోన్నతిపై కొందరు ఆర్టీఐ దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.

  పంచాయతీ నిధుల ఖర్చుపై విచారణ

వేములపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో రూ. 4,65,702 పంచాయితీ నిధుల ఖర్చుకు సంబంధించి నిబందనలు పాటిం చలేదని డీఎల్‌పీవో  జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో నాటి కార్యదర్శి వెంకటేశ్వర్లుకు పనిష్‌మెంట్‌గా రెండు ఇంక్రిమెంట్లు కోత విధిం చి శాఖాపరమైన విచారణ కొనసాగిస్తున్నారు.  నిధుల అవకతవకలకు సంబంధించి విచారణ లేకుండా అధికార పార్టీ నేతలతో ఉన్న తాధికారు లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. చీటికి మాటికి సిబ్బందిపై ఆరోపణ లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న ఎంపీవోపై అధికారులు పూర్తి స్థాయి లో విచారణ చేసి, శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-06-22T06:39:38+05:30 IST