కుక్కల స్వైరవిహారం

ABN , First Publish Date - 2020-10-01T08:37:47+05:30 IST

గ్రామాల్లో, ప్రధాన రహదారులపై కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో ద్విచక్ర

కుక్కల స్వైరవిహారం

 పి.గన్నవరం, సెప్టెంబరు 30: గ్రామాల్లో,  ప్రధాన రహదారులపై కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు తరుచూ ప్రమదాలకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాం తాల్లో వీధి కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి.


పి.గన్నవరం సీహెచ్‌సీలో నెలకు సుమారు 40నుంచి 50వరకు కుక్క కాటు కేసులు నమోదు అవుతున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.  ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో కుక్కకాటుకు వ్యాక్సిన్‌ కొరత ఉంది. ద్విచక్ర వాహనాలకు కుక్కలు అడ్డురావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.


గ్రామాల్లో సంచారం

మామిడికుదురు, సెప్టెంబరు 30: గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోను వీధి కుక్కలు పదుల సంఖ్యలో పెరిగిపోయి అనేక ఇబ్బం దులకు గురి చేస్తున్నాయని ఆరోపిస్తు న్నారు. రాత్రి వేళల్లో రోడ్లపైకి వచ్చేం దుకు భయపడాల్సి వస్తుందని పేర్కొం టున్నారు.


అంతే కాకుండా రాత్రి సమయాల్లో గుంపులు గుంపులుగా కుక్కలు మొరుగుతూ ఉండ డంతో చిన్నపిల్లలతో సహా పెద్దలు కూడా భయ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. గతంలో పంచాయతీ అధికారులు వీధి కుక్క లను నియంత్రించే వారని, ఇటీవల అడ్డంకులు రావడంతో పంచాయతీలు పట్టించుకోవడంలేని ఆరోపిస్తున్నారు. వెంటనే ఏదోకరకంగా కుక్కల బెడద తొలగించి సమస్యను పరిష్కరించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-10-01T08:37:47+05:30 IST