up police chief : కాన్పూర్‌లో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్

ABN , First Publish Date - 2021-08-09T15:29:51+05:30 IST

ఉత్తరప్రదేశ్ పోలీసు చీఫ్ ముకుల్ గోయల్ కాన్పూర్ నగరంలో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ పై సంచలన వ్యాఖ్యలు...

up police chief : కాన్పూర్‌లో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ పోలీసు చీఫ్ ముకుల్ గోయల్ కాన్పూర్ నగరంలో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాన్పూర్ నగరంలో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ను గుర్తించేందుకు యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నిఘా ఉంచాలని డీజీపీ ఆదేశించారు.లక్నో నగరంలో అనుమానిత ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్టు చేసిన నేపథ్యంలో కాన్పూరు నగరంలోనూ నిఘా పెంచామని డీజీపీ పేర్కొన్నారు.కాన్పూర్ నగరంలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ ఉండే అవకాశముందని డీజీపీ చెప్పారు.కాన్పూరులో కొవిడ్ కేర్ ఆసుపత్రిని ప్రారంభించిన డీజీపీ ఉగ్రవాదుల సెల్స్ పై తాజా వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అల్ ఖైదా మద్ధతు ఉన్న అన్సార్ గజ్వతుల్ హింద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గత నెలలో లక్నో శివార్లలో అరెస్టు చేశారు.వీరి అరెస్టుతో ముష్కరులు పలు చోట్ల పేలుళ్లకు పథకం పన్నారని తేలింది. అనుమానిత ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 15వతేదీ స్వాతంత్ర్య దినోత్సవం లోపు యూపీలోని పలు నగరాల్లో ఉగ్రవాద దాడులు చేయాలని ఉగ్రవాదులు పథకం పన్నారని వెల్లడైంది. 


Updated Date - 2021-08-09T15:29:51+05:30 IST