గంజాయి నిందితుడిని అరెస్ట్ చేశాం: సీపీ

ABN , First Publish Date - 2021-10-19T21:49:26+05:30 IST

గంజాయి తరలిస్తున్న నిందితుడు నాగసాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు....

గంజాయి నిందితుడిని అరెస్ట్ చేశాం: సీపీ

హైదరాబాద్: గంజాయి తరలిస్తున్న నిందితుడు నాగసాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. వాట్సాప్‌ గ్రూప్‌తో గంజాయి సరఫరా చేస్తున్నాడన్నారు. నగరంలో ఉన్న ఏజెంట్ల సాయంతో గంజాయి విక్రయిస్తున్నాడని సీపీ అన్నారు. అలాగే కమీషన్‌పై స్థానిక ఏజెంట్లకు సరఫరా చేస్తున్నడని పేర్కొన్నారు. రూ.1500లకు కొని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు విక్రయం చేస్తున్నాడని తెలిపారు. పలు రాష్ట్రాల గంజాయి వ్యాపారాలుతో సంబంధాలతోపాటు నిందితుడిపై పలు పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయని సీపీ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-19T21:49:26+05:30 IST