Abn logo
Sep 23 2021 @ 23:49PM

లిక్విడ్‌గా గంజాయి

స్మగ్లర్ల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సునీల్‌

ఇరువురిని అరెస్టు చేసిన చిన్నచౌక్‌ పోలీసులు
5 లీటర్ల గంజాయి లిక్విడ్‌ స్వాఽధీనం
కడప(క్రైం), సెప్టెంబరు 23:
గంజాయిని లిక్విడ్‌గా మార్చి విక్రయించేందుకు వచ్చిన ఇద్దరిని చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారు. కడప డీఎస్పీ కార్యాలయంలో డీఎప్పీ సునీల్‌ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి స్మగ్లర్ల వివరాలను వెల్లడించారు. విశాఖపట్నం చింతపల్లి మండలం చెదలపాడు గ్రామానికి చిక్కుడు చిన్నబాబు, కొండపల్లి గ్రామానికి చెందిన వంతల ప్రసాద్‌ ఆ ప్రాంతంలోనే గంజాయి సేకరించి వాటికి కెమికల్‌ కలిపి మత్తు ఎక్కువ వచ్చే విధంగా లిక్విడ్‌ తయారు చేశారు. సిగరెట్‌కు ఈ గంజాయి లిక్విడ్‌ పూసుకొని తాగితే మత్తు ఎక్కువగా వచ్చే విధంగా దీనిని తయారు చేశారు. మొదటి సారిగా 5 లీటర్ల లిక్విడ్‌ను కడపకు తీసుకొచ్చి ఎలా వినియోగించాలో తమ ఏజెంట్లకు చెప్పారు. వారి ద్వారా అమ్మే ప్రయత్నం చేస్తుండగా ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 5 లీటర్ల గంజాయి లిక్విడ్‌, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను ఎంతో చాకచక్యంగా అరెస్టు చేసిన సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు రోషన్‌, అమరనాథరెడ్డి, సిబ్బంది సుధాకర్‌, రామసుబ్బారెడ్డి, రాజే్‌షకుమార్‌, శ్రీనివాసులు, జనార్ధన్‌రెడ్డి, శివప్రసాద్‌, సుధాకర్‌యాదవ్‌, ప్రసాద్‌, శ్రీనివాసరావు, తిరుపతయ్యలను కడప డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.