కావలసినవి
పసుపు, ఎరుపు, నీలం రంగు పూసలు, ఒక గాజు గ్లాసు, జిగురు, ఎలక్ట్రిక్ టీ లైట్ క్యాండిల్.
ఇలా చేయాలి...
ముందుగా గ్లాసును శుభ్రంగా తుడవాలి.
తరువాత గ్లాసు చుట్టూ జిగురు పూయాలి.
ఇప్పుడు రంగురంగుల పూసలను పక్కపక్కన అతికించాలి.
గ్లాసు ఎక్కడా కనిపించకుండా పూసలను పూర్తిగా అతికించాలి.
ఆరిన తరువాత గ్లాసు లోపల ఎలక్ట్రిక్ టీ లైట్ క్యాండిల్ పెట్టి వెలిగించాలి.