టెట్‌ అభ్యర్థులకు నేటి నుంచి టీ-శాట్‌లో పాఠాలు

ABN , First Publish Date - 2022-04-04T10:02:25+05:30 IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు టీ-శాట్‌ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ...

టెట్‌ అభ్యర్థులకు నేటి నుంచి టీ-శాట్‌లో పాఠాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు టీ-శాట్‌ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 5వ తేదీ వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఈ మేరకు టీ-శాట్‌ నెట్‌వర్క్‌ చానళ్ల సీఈవో శైలేష్‌ రెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం మినహా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య పాఠ్యాంశాలు టీ-శాట్‌ విద్య చానల్‌లో ప్రసారం అవుతాయి. అలాగే, సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు టెట్‌ మొదటి, రెండవ ప్రశ్న పత్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలపై ప్రత్యేక లైవ్‌ పాఠాలు ఉంటాయి. 60 రోజులు, 120 పాఠ్యాంశ భాగాలు టీ-శాట్‌లో ప్రసారమవుతాయి. అలాగే, టీ-శాట్‌ మాక్‌ టెస్ట్‌ కూడా నిర్వహించనుందని శైలేష్‌ రెడ్డి చెప్పారు.

Updated Date - 2022-04-04T10:02:25+05:30 IST