ఖర్చులకు లెక్క చెప్పాలి
ABN , First Publish Date - 2021-03-07T05:14:22+05:30 IST
ము న్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల లెక్కలను సమర్పించాలని ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు సెల్వం అన్నారు.
జిల్లా వ్యయ పరిశీలకుడు సెల్వం
కొవ్వూరు, మార్చి 6 : ము న్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల లెక్కలను సమర్పించాలని ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు సెల్వం అన్నారు. కొవ్వూ రు మున్సిపల్ కార్యాలయంలో శనివారం అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి రికార్డులను తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అభ్యర్థులు ఎన్నికలలో చేసిన ఖర్చులను అధికారులకు అందజేయాలన్నారు. ఈ నెల 9న కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులను అందజేయాలన్నారు. మున్సిపల్ అధికారుల నుంచి స్థానిక వివరాలు అడిగి తెలుసుకున్నారు.