నేరచరితులకు పింఛన్ రద్దు

ABN , First Publish Date - 2021-09-04T05:52:19+05:30 IST

ప్రజాప్రతినిధులు పలువురు నేరచరి తులుగా నమోదు కావడం శోచనీయం. వీరిపై జిల్లా స్థాయి నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ ఉన్న అనేక కేసులు పరిష్కారం కాకుండా విచారణలోనే ఉన్నాయి. ఈ ఘరానా....

నేరచరితులకు పింఛన్ రద్దు

ప్రజాప్రతినిధులు పలువురు నేరచరి తులుగా నమోదు కావడం శోచనీయం. వీరిపై జిల్లా స్థాయి నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ ఉన్న అనేక కేసులు పరిష్కారం కాకుండా విచారణలోనే ఉన్నాయి. ఈ ఘరానా నేతలు తమ రాజకీయ ప్రాబల్యంతో వాయిదాల మీద వాయిదాలు సాధిస్తూ చట్టానికి చిక్కకుండా స్వేచ్ఛాజీవనం సాగిస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం యథావిధిగా ప్రతీ నెలా పింఛన్ చెల్లిస్తోంది. నేర రాజకీయాలను అరికట్టేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎన్నడూ లేని విధంగా చొరవ తీసుకుంటున్నది. అలాగే నేరచరితులయిన మాజీ ఎంపీలు, ఎమ్మల్యేలకు పింఛన్ చెల్లింపును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలి. అలా చేయడం అందరికీ కనువిప్పు అవుతుంది.


-యర్రమోతు ధర్మరాజు

ధవళేశ్వరం

Updated Date - 2021-09-04T05:52:19+05:30 IST