Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 16 Aug 2022 12:27:40 IST

వయసు పైబడిన వారిలో Cancer ముప్పు

twitter-iconwatsapp-iconfb-icon
వయసు పైబడిన వారిలో Cancer ముప్పు

మానవుని శరీరంలో కణాలు పరిపక్వ స్థితికి రాగానే అవి విభజన చెంది, ఎప్పటికప్పుడు కొత్త కణాలుగా ఏర్పడుతూ ఉంటాయి. చిన్న వయసులో శరీర కణాలు వేగంగా వృద్ధి చెందుతుంటాయి. అందుకే మనిషి ఎదుగుదల సాధ్యమవుతుంది. కానీ వయసు పెరిగీ కొద్దీ కణాల విభజన, వృద్ధి తగ్గిపోయి శరీరం ఎదుగుదల నిలిచిపోతుంది. ఈ క్రమంలో పాతబడి కాలం చెల్లిన కణాలను భర్తీ చేయడానికి మాత్రమే కొత్త కణాలు పుడతాయి. అయితే సహజసిద్ధంగా, క్రమబద్ధంగా జరిగే ప్రక్రియలో ఎక్కడో తేడా వచ్చి, పాత కణాలు క్షీణించకుండానే, అనేక కొత్త కణాలు పుట్టుకురావడం వల్ల శరీర భాగాల్లో కణితులు ఏర్పడతాయి. ఏర్పడిన ప్రదేశానికి మాత్రమే పరిమితమయ్యే కణితిని నాన్‌ క్యాన్సర్‌(Cancer) కణితి అంటారు. వీటివల్ల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. శరీరంలోని ఒక అవయవ భాగంలో ఏర్పడి.. దాని చుట్టుపక్కల, ఇతర భాగాలకు వ్యాపించే కణితిలను క్యాన్సర్‌ కణితులుగా పరిగణిస్తారు. 


ఆ వయసులో ఎక్కువ: ‘నేషనల్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌’ సర్వే ప్రకారం కొత్త క్యాన్సర్‌లలో 60 శాతం 65 సంవత్సరాల పైబడినవారిలోనే కనిపిస్తున్నాయి. వారిలో 70 శాతం మృత్యువాత పడుతున్నారు. వీరు క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం పది రెట్లు అధికం. ముఖ్యంగా కొలాన్‌, రెక్టల్‌, ప్రొస్టేట్‌, ప్యాంక్రియాజ్‌, ఊపిరితిత్తులు, మూత్రాశయం, పొట్ట, రొమ్ము క్యాన్సర్‌ వంటివి వచ్చే అవకాశం ఎక్కువ. క్యాన్సర్‌ కణితులు చికిత్సకు లొంగడం కష్టం. 


ప్రధాన కారణాలు: వయసు పైబడిన వారిలో క్యాన్సర్‌ రావడానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. చిన్నతనంలో దీర్ఘకాలికంగా ధూమపానం, మద్యపానం, ఎక్కువ మందితో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వంటి దురలవాట్లు. 


రోగనిరోధక శక్తి తగ్గడం 

  • కొన్ని రకాల హార్మోన్లు ఎక్కువగా తీసుకోవడం 
  • కణాల్లో మార్పు సంభవించి, వయసు పైబడిన తరువాత బయటపడడం 
  • వృత్తిపరంగా కొన్ని రకాల రసాయనాలకు ఎక్కువగా గురవ్వడం 
  • వేర్వేరు వ్యాధులు... వాటికి తీసుకొనే చికిత్స 
  • వెర్నర్‌ సిండ్రోమ్‌, అల్జీమర్స్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధులున్న వారికి వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు అధికం. 
  • 60 ఏళ్లు పైబడిన తరువాత కూడా నెలసరి ఆగలేదంటే అనుమానించాలి
  • 9 ఏళ్లలోనే నెలసరి, ఆలస్యంగా వివాహం, నడి వయసులో గర్భం దాల్చడం వల్ల రొమ్ము క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.   
  • పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్స్‌ స్థాయిలు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. 


చికిత్సా పద్ధతులు: అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల అరుగుదల, థైరాయిడ్‌, గుండె రక్తనాళాల్లో పూడికల వంటి సమస్యలు వయస్సుతో పాటు పెరిగి వేధిస్తూ ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని రోగులకు క్యాన్సర్‌ చికిత్స చాలా జాగ్రత్తగా, పర్సనలైజ్డ్‌గా ఇవ్వాలి. వారి మానసిక, సామాజిక, కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ఆలోచించి, ధైర్యం చెబుతూ చికిత్స అందించాలి. ఈ క్రమంలో కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది. హార్మోన్లకు సంబంధించిన క్యాన్సర్‌ చికిత్సల్లో భాగంగా సర్జరీ, రేడియేషన్‌, కీమోలతో పాటు హార్మోన్‌ థెరపీకి అధిక ప్రాధాన్యం ఇస్తాం. 


ముందస్తు పరీక్షలు: 40 ఏళ్ల వయసు పైబడిన స్త్రీలు మమోగ్రామ్‌ వంటి క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు, 50 ఏళ్లు దాటిన పురుషులు పీఎస్‌ఏ టెస్ట్‌, హెపటైటి‌స్-బి, లంగ్‌, లివర్‌ ఫంక్షనింగ్‌ టెట్టుల వంటివి చేయించుకోవాలి. చిన్న వయసు నుంచే మంచి ఆహార, వ్యవహార, జీవనశైలితో పాటు శరీరంలో మార్పులను ముందే పసిగట్టే స్ర్కీనింగ్‌ పరీక్షలు, తొలి దశలోనే చికిత్సతో క్యాన్సర్లకు చెక్‌ పెట్టవచ్చు.


-డాక్టర్‌ సి.హెచ్‌ మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌

ఒమేగా హాస్పిటల్స్‌,బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421

వయసు పైబడిన వారిలో Cancer ముప్పు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.