కేన్సర్‌ చికిత్సకెళ్తే... కరోనా

ABN , First Publish Date - 2020-06-01T09:33:16+05:30 IST

కేన్సర్‌తో పోరాడుతున్న మాజీ బాక్సర్‌ డింకో సింగ్‌ ఆరోగ్యం మరింతగా కలవరపెడుతోంది. డింకోకు కరోనా సోకినట్టు అతడి సంబంధీకులు ఆదివారం తెలిపా రు. ఆసియాడ్‌ స్వర్ణ పతక విజేత డింకోసింగ్‌ 2017 నుంచి కాలేయ కేన్సర్‌తో

కేన్సర్‌ చికిత్సకెళ్తే... కరోనా

  • మాజీ బాక్సర్‌ డింకోకు పాజిటివ్‌

న్యూఢిల్లీ: కేన్సర్‌తో పోరాడుతున్న మాజీ బాక్సర్‌ డింకో సింగ్‌ ఆరోగ్యం మరింతగా కలవరపెడుతోంది. డింకోకు కరోనా సోకినట్టు అతడి సంబంధీకులు ఆదివారం తెలిపా రు. ఆసియాడ్‌ స్వర్ణ పతక విజేత డింకోసింగ్‌ 2017 నుంచి కాలేయ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో రేడియేషన్‌ థెరపీ కోసం మణిపూర్‌ నుంచి ఢిల్లీకి ఎయిర్‌ అంబులెన్స్‌లో తరలించారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో అతడికి కరోనా పరీక్ష చేయగా నెగిటివ్‌గా వచ్చింది. కానీ, మణిపూర్‌ చేరుకున్న తర్వాత పరీక్షిస్తే పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుత్తం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 

Updated Date - 2020-06-01T09:33:16+05:30 IST