Tirumalaలో శ్రీవారి ఆర్జితసేవల రద్దు

ABN , First Publish Date - 2022-05-08T02:08:41+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే వారాంతపు ఆర్జిత సేవలైన అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Tirumalaలో శ్రీవారి ఆర్జితసేవల రద్దు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే వారాంతపు ఆర్జిత సేవలైన అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ  సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ప్రతి శుక్రవారం జరిగే నిజపాద దర్శనాలను  కూడా రద్దు చేశారు. కొవిడ్‌ నాలుగో వేవ్‌పై కేంద్రం హెచ్చరికలు, వేసవి రద్దీ కారణంగా ఈ మూడింటినీ జూన్‌ 30వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.శ్రీవారికి నిత్య సేవలతో పాటు వారపు సేవలను నిర్వహిస్తారు. సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళపాదపద్మారాధన, బుధవారం సహస్రకళాశాభిషేకం, గురువారం తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం, మేల్‌చాట్‌ వస్త్రం సేవలను నిర్వహిస్తారు. వీటిలో మూడు సేవలను 2019 డిసెంబరులో రద్దు చేశారు. శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు 450 సార్లు చేసే అభిషేకాల  వల్ల పూరాతనమైన విగ్రహాలకు అరుగుదల ఏర్పడుతుందని భావించి, ఆలయ ప్రధాన అర్చకులు, జీయంగార్ల సూచనమేరకు అభిషేకాలతో ఇమిడిఉన్న సహస్ర కలశాభిషేకం, విశేషపూజ, వసంత్సోవం వంటి ఆర్జితసేవలను గతంలోనే రద్దు చేశారు. తాజాగా మరో మూడు ఆర్జితసేవలకు తాత్కాలికంగా బ్రేక్‌ వేశారు.

Read more