ఉగాదికి మత్తడి పోచమ్మ జాతర రద్దు

ABN , First Publish Date - 2021-04-10T04:37:27+05:30 IST

మండల కేంద్రంలో ప్రతీ యేట ఉగాది నుంచి మూడు రోజుల పాటు నిర్వ హించే చారిత్రక జాతర మత్తడి పోచమ్మ జాతరను ఈ ఏడు రద్దు చేసినట్లు తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌, ఎస్సై శ్రీకాంత్‌లు ప్రకటించారు.

ఉగాదికి మత్తడి పోచమ్మ జాతర రద్దు
లింగంపేటలో మత్తడి పోచమ్మ జాతరపై కుల సంఘాలతో మాట్లాడుతున్న ఎస్సై

లింగంపేట, ఏప్రిల్‌ 9: మండల కేంద్రంలో ప్రతీ యేట ఉగాది నుంచి మూడు రోజుల పాటు నిర్వ హించే చారిత్రక జాతర మత్తడి పోచమ్మ జాతరను ఈ ఏడు రద్దు చేసినట్లు తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌, ఎస్సై శ్రీకాంత్‌లు ప్రకటించారు. లింగంపేట మండ ల కేంద్రంలోని ఐకేపీ భవనంలో శుక్రవారం మండ లంలోని వివిధ కుల సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా నిర్వహించే అమ్మవారి జాతర కరోనా కారణంగా గత సంవత్స రం రద్దు చేశారు. తిరిగి ఈ సంవత్సరం జాతర సమయానికి కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ యేడు జాతరను రద్దు చేసినట్లు వారు తెలిపా రు. ఉగాది రోజున నిర్వహించే ఎడ్ల బండ్ల ప్రదర్శన, రెండో రోజు నిర్వహించే రథోత్సవం. మూడో రోజు నిర్వహించే కుస్తీ పోటీలు రద్దు చేశామని వారు తెలిపారు. ఆలయం వద్ద ఎలాంటి దుకాణాలు ఏర్పాటు చేయవద్దని హెచ్చరించారు. ఏప్రిల్‌ 30 వరకు ర్యాలీలు, ఉత్సవాలను ప్రభుత్వం రద్దు చేసిందని వారు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవల ం ఒక్కొక్కరు వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలని,  మాస్క్‌ ధరించాలన్నారు. కార్యక్రమంలో మండలం లోని వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొ న్నారు.

Updated Date - 2021-04-10T04:37:27+05:30 IST