దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలకు జారీ చేసిన ప్రకటన రద్దు

ABN , First Publish Date - 2022-01-21T06:53:40+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో దివ్యాంగుల బ్యాక్‌లా గ్‌ ఉద్యోగాల భర్తీకి 2022 సం వత్సరం జనవరి 12న జారీ చేసిన ప్రకటన రద్దు చేస్తున్న ట్లు కలెక్టర్‌ ప్రశాంత జీవన పాటిల్‌ తెలిపారు.

దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలకు జారీ చేసిన ప్రకటన రద్దు

నల్లగొండటౌన, జనవరి 20: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో దివ్యాంగుల బ్యాక్‌లా గ్‌ ఉద్యోగాల భర్తీకి 2022 సం వత్సరం జనవరి 12న జారీ చేసిన ప్రకటన రద్దు చేస్తున్న ట్లు కలెక్టర్‌ ప్రశాంత జీవన పాటిల్‌ తెలిపారు. తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (ఆర్గనైజేషన ఆఫ్‌ లోకల్‌ క్యాడర్స్‌, రెగ్యులేషన ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఉత్తర్వులు 2018 అనుసరించి కొత్త లోకల్‌ క్యాడర్‌ అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కాకుండా ఏ జిల్లాలోని ఖాళీలను అదే జిల్లాలో భర్తీ చేసేందుకు సంబంధిత జిల్లాల కలెక్టర్లు త్వరలో చర్యలు తీసుకుంటారని కలెక్టర్‌ పేర్కొన్నారు. 



Updated Date - 2022-01-21T06:53:40+05:30 IST