హౌస్‌ ఫర్‌ ఆల్‌ క్యాన్సిల్‌

ABN , First Publish Date - 2020-07-02T10:14:41+05:30 IST

గత ప్రభుత్వం ఆధ్వర్యంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అప్పటి సీఎం చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా

హౌస్‌ ఫర్‌ ఆల్‌ క్యాన్సిల్‌

పట్టణాల్లో దాదాపు పూర్తయిన గ్రూపు గృహ సముదాయాల పథకం రద్దు 

ఎన్నికల ముందు కోడ్‌ అడ్డంకితో అప్పట్లో నిర్మాణాల నిలిపివేత 

గత ఏడాది జూలై 3న పథకాన్ని పక్కనపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు 

తాజాగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లను గాలికొదిలేస్తూ ఉత్తర్వులు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం ఆధ్వర్యంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అప్పటి సీఎం చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అనుమతి పొందిన హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకాన్ని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ శాఖతో సర్క్యులర్‌ ఇప్పించింది. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో గత నాలుగేళ్లలో తలపెట్టిన ఈ స్కీంలో గ్రూపు గృహ సముదాయాలు 90 శాతం మేర పూర్తయ్యాయి. ఈలోగా ఎన్నికల కోడ్‌ అడ్డు రావడంతో     అప్పట్లో వాటి నిర్మాణాలను నిలిపివేశారు.


వైసీపీ అధికారంలోకి వచ్చాక   గత ఏడాది ఇదే నెలలో 3వ తేదీన ఈ ప్రభుత్వం ఆల్‌ ఫర్‌ హౌస్‌  పథకాన్ని పక్కనపెడుతూ ఉత్తర్వులు చేసింది. తాజాగా వివిధ దఽశల్లో నిర్మాణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లను గాలికొదిలేస్తూ బుధవారం సర్క్యులర్‌ జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వం ఆల్‌ ఫర్‌ హౌస్‌ స్కీం పేరు తో పేదలకు ఇళ్ల పథకంలో గోడలు తరహాలో కాకుండా, శ్లాబ్‌ సిస్టమ్‌తో దృఢంగా గ్రూప్‌ అపార్ట్‌మెంట్‌లను నిర్మించి, సగం సబ్సిడీ భరించి, మిగి లింది బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి ఇవ్వాలని తల చింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఈ గృహాలను లబ్ధిదారులకు కేటాయిం చకుండా ప్రత్యామ్నాయ చర్యలకు దిగుతోంది. అయితే 90 శాతం పూర్త యిన సదరు గృహాలను ఏం చేస్తుందనేది స్పష్టం చేయలేదు. మునిసిపాల్టీల్లో సొంతిల్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్‌ ఫర్‌ హౌస్‌ స్కీం ప్రారంభించిన సంగతి తెలిసిందే.


రెండు ప్రభు త్వాలు లబ్ధిదారులకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చి వారి సొంతింటి కల నెరవేర్చాలని భావించాయి. ఆ దిశగా అడుగులు వేశాయి. స్థల సేకరణ నుంచి నిర్మాణాల వరకూ వేగం పెంచాయి. కాకినాడ నగరంతోపాటు, రాజమహేంద్రవరం, తుని, పిఠా పురం, సామర్లకోట, పెద్దాపురం, మండపేట, రామచంద్రపురం, అమలాపురం పట్టణాల్లో బహుళ అంతస్తుల గృహ నిర్మాణాల సముదాయాలు జోరం దుకున్నాయి. ఏడాది కిందట జరిగిన సాధారణ ఎన్నికలు ఈ స్పీడ్‌కు కోడ్‌ రూపంలో అడ్డుగోడగా నిలిచాయి. తదనుగుణంగా ఎన్నికల ముందు పనులు తాత్కలికంగా నిలిచిపోయాయి. ఎన్నికల ఫలితాలు వెలువడడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం అన్నీ చకచకా జరిగిపోయాయి.


ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటాకా ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పారు. జిల్లాలో మూడు విడతలుగా సుమారు 52 వేల గృహాల నిర్మాణాలు చేపట్టారు. 25 వేల ఇళ్లు దాదాపు పూర్తి దశలో ఉన్నాయి. 16 వేల ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ గృహాలు కొన్నిచోట్ల కొవిడ్‌ 19 వైరస్‌ క్వారంటైన్‌ సెంటర్లుగా వినియో గంలో ఉన్నాయి.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీంలో తలపెట్టిన గృహాలను జీ ప్లస్‌ త్రీ అపార్ట్‌ మెంట్ల తరహాలో నిర్మించారు. ఏపీ పట్టణ నివాస సముదాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మాణాలు చేశారు. మూడు కేటగిరిల్లో నిర్మించిన వీటికి ప్రభుత్వం రూ. 3 లక్షలు సబ్సిడీ చెల్లిస్తుంది.


కొంత సొమ్మును లబ్ధి దారులు తమ వాటాగా భరించాల్సి ఉంటుంది. మిగిలిన సొమ్మును బ్యాంకులు రుణాలుగా ఇప్పిం చేందుకు టీడీపీ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇక రూ.12,500, రూ. 25,000 తమ వాటాగా లబ్ధిదారు లు డీడీల రూపంలో ఆయా మునిసిపాల్టీల్లో అంద జేశారు. మిగిలిన సొమ్మును వాయిదాల్లో చెల్లించా లని అప్పటి ప్రభుత్వం గడువు ఇచ్చింది. కొందరైతే వారి వాటా సొమ్మును పూర్తిగా చెల్లించేశారు. ఇప్పుడు పథకాన్ని రద్దు చేయడంతో  చెల్లించిన సొమ్ము తిరిగి ఇస్తారా అనే మీమాంస ఉంది.

Updated Date - 2020-07-02T10:14:41+05:30 IST