బ్రెజిల్‌లో కొవాగ్జిన్‌పై క్లినికల్‌ పరీక్షలు రద్దు

ABN , First Publish Date - 2021-07-25T06:12:39+05:30 IST

కొవాగ్జిన్‌పై క్లినికల్‌ పరీక్షలను బ్రెజిల్‌ నిలిపివేసింది. బ్రెజిల్‌ భాగస్వామి ప్రెసిసా మెడికామెంటోస్‌ అండ్‌ ఎన్విక్సియా ఫార్మాస్యూటికల్స్‌తో భారత్‌ బయోటెక్‌ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడంతో బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ ప్రాధికార సంస్థ అన్విసా ఈ నిర్ణయం తీసుకుంది.

బ్రెజిల్‌లో కొవాగ్జిన్‌పై క్లినికల్‌ పరీక్షలు రద్దు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవాగ్జిన్‌పై క్లినికల్‌ పరీక్షలను బ్రెజిల్‌ నిలిపివేసింది. బ్రెజిల్‌ భాగస్వామి ప్రెసిసా మెడికామెంటోస్‌ అండ్‌ ఎన్విక్సియా ఫార్మాస్యూటికల్స్‌తో భారత్‌ బయోటెక్‌ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడంతో బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ ప్రాధికార సంస్థ అన్విసా ఈ నిర్ణయం తీసుకుంది.  బ్రెజిల్‌లో కొవాగ్జిన్‌పై క్లినికల్‌ పరీక్షలు ఇంకా ప్రారంభం కాలేదు. బ్రెజిల్‌కు 2 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ను సరఫరా చేయడానికి భారత్‌ బయో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్‌ కొనుగోలుకు అధిక ధర చెల్లించారంటూ బ్రెజిల్‌లో వివాదం చెలరేగింది. దీనిపై విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌లోని భాగస్వామితో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు శుక్రవారం భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. 

Updated Date - 2021-07-25T06:12:39+05:30 IST