కాణిపాకంలో ఆర్జిత, సాంస్కృతిక సేవలు రద్దు

ABN , First Publish Date - 2020-08-11T11:19:14+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత, సాంస్కృతిక సేవలు రద్దు చేస్తున్నట్లు ఈవో ..

కాణిపాకంలో ఆర్జిత, సాంస్కృతిక సేవలు రద్దు

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 10: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత, సాంస్కృతిక సేవలు రద్దు చేస్తున్నట్లు ఈవో వెంకటేశు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి  ప్రతి ఒక్కరూ కృషిచేయాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌బాబు పిలుపునిచ్చారు. ఆలయ ఆస్థాన మండపంలో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో, ఆలయ ఉభయదారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయంలో స్వామికి నిర్వహించే పూజాది కైంకర్యాలలో ఎలాంటి లోటు లేకుండా చూస్తామన్నారు.


దళితులందరూ కమిటీ వేసుకుని ఓ నిర్ణయానికి వస్తే దళిత సత్రం నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ బస్సులను సమయానికి నడపాలని కోరారు. ఈవో వెంకటేశు మాట్లాడుతూ చవితి రోజున ఉదయం 5 గంటల నుంచి, ధ్వజారోహణం రోజున ఉదయం 9.30 గంటల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. మద్యం దుకాణాలను 21 రోజుల పాటు మూసివేలాని సూచించారు. ఉదయం స్వామికి 20 మందితో అభిషేకం, సాయంత్రం 50మందితో కలిసి ప్రాకారోత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రేణుక, ఈఈ వెంకటనారాయణ, తహసీల్దార్‌ కేఏ మధుబాబు, ఎంపీడీవో నిర్మలాదేవి, ఏఈవోలు రవీంద్రబాబు, విద్యాసాగర్‌రెడ్డి, చిట్టెమ్మ, పర్యవేక్షకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T11:19:14+05:30 IST