‘తోట’ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-06-21T05:12:33+05:30 IST

తోట త్రిమూర్తులుకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.

‘తోట’ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలి
పొట్టిలంకలో నిరసన తెలుపుతున్న దళిత సంఘాల నాయకులు

  •  పొట్టిలంకలో దళితసంఘాల ఆందోళన 

కడియం, జూన్‌ 20: తోట త్రిమూర్తులుకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. పొట్టిలంక గ్రామంలో ఆదివారం బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శిరోముండనం ఐక్య పోరాట కమిటీ జిల్లా కన్వీనర్‌ వేంపల్లి భీమశంకర్‌ మాట్లాడుతూ శిరోముండన కేసును విచారణ చేయకుండా జాప్యం చేయడంతోపాటు దళితుల ఓట్లతో నెగ్గిన పార్టీలు త్రిమూర్తులుకు మద్దతు ఇవ్వడం విచారకరమన్నారు. కమిటీ కో-కన్వీనర్లు ఇసుకపట్ల రాంబాబు, నక్కా వెంకటరత్నంరాజు, కుల నిర్మూలన పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు కోనాల లాజర్‌ మాట్లాడుతూ గవర్నర్‌ వ్యతిరేకించినా సీఎం జగన్‌ పట్టుతో త్రిమూర్తులును ఎమ్మెల్సీగా నియమించడం దళితులను అవమానించినట్లేనని అన్నారు. కార్యక్రమంలో మొగలపు రాజు, కొల్లపు విజయ్‌, గుమ్మడి రాజు, దాసి వీరమహేష్‌, నక్కా దావీదు, రేముళ్ళ రాజు, బడుగు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:12:33+05:30 IST