ఆర్టీసీ రిజర్వేషన్‌ టికెట్లను రద్దు చేసుకోండి

ABN , First Publish Date - 2021-05-07T06:49:40+05:30 IST

‘కరోనా దృష్ట్యా విశాఖ, విజయవాడ, అనంత పురం, హైదరాబాద్‌, చెన్నై, పుదుచ్చేరి వంటి దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడపడం లేదు.

ఆర్టీసీ రిజర్వేషన్‌ టికెట్లను రద్దు చేసుకోండి

ప్రయాణ తేదీనుంచి 15 రోజుల్లోపు ఎపుడైనా నగదు వాపస్‌ తీసుకోవచ్చు


తిరుపతి(రవాణా), మే 6: ‘కరోనా దృష్ట్యా విశాఖ, విజయవాడ, అనంత పురం, హైదరాబాద్‌, చెన్నై, పుదుచ్చేరి వంటి దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. కానీ ఆయా ప్రాంతాలకు ఇప్పటికే రిజర్వేషన్‌ చేసు కున్నవారు తమ టికెట్లను రద్దు చేసుకునే అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ప్రయాణ తేదీ నుంచి 15 రోజుల్లోపు తమ టికెట్లను రద్దు చేసుకుని, నగదును వెనక్కి పొందొచ్చు’ అని తిరుపతి సెంట్రల్‌ బస్టాండు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ (ఏటీఎం) విశ్వనాథ్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నవారు ఆన్‌లైన్‌ ద్వారానే రద్దు చేసుకోవాలి. నగదు వారి బ్యాంకు ఖాతాలకు జమవుతుంది. కౌంటర్‌ ద్వారా టికెట్‌ పొందినవారు.. కౌంటర్‌ వద్దకొచ్చి నగదును వాపస్‌ తీసుకోవచ్చు. 15రోజుల కాలపరిమితి దాటితే నగదును తిరిగి పొందేందుకు అవకాశం ఉండదు. దూర ప్రాంతాలకు రిజర్వేషన్‌ టికెట్లను బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఏటీఎం సూచించారు. 

Updated Date - 2021-05-07T06:49:40+05:30 IST