జీవో-82 రద్దుచేయండి

ABN , First Publish Date - 2021-11-26T05:22:24+05:30 IST

జీవో -82ను రద్దు చేసి ఉచితంగా ఇంటి హక్కు రిజిస్ర్టేషన్‌ చేయాలని సీపీఎం నాయకుడు ఎం. తిరుపతిరావు డిమాండ్‌ చేశారు.

జీవో-82 రద్దుచేయండి
భామిని: మాట్లాడుతున్న తిరుపతిరావు


భామిని:  జీవో -82ను రద్దు చేసి ఉచితంగా ఇంటి హక్కు రిజిస్ర్టేషన్‌  చేయాలని  సీపీఎం  నాయకుడు ఎం. తిరుపతిరావు డిమాండ్‌ చేశారు. గురువారం భామినిలో సీపీఎం నాయకులతో సమావేశం నిర్వహిం చారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ పేరుతో రూ.10 వేలు వసూలు చేయడం నిలిపివేయాలని కోరారు. కార్య క్రమంలో నాయకులు ప్రకాశరావు, మిన్నారావు, భాస్కర రావు, ప్రసాద్‌ పాల్గొన్నారు. ఫ వజ్రపుకొత్తూరు:  సంపూర్ణ గృహహక్కుపేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి జారీచేసిన జీవోను రద్దుచేయాలని మహిళా సంఘ నాయకురాలు బి.లక్ష్మి కోరారు.  గురువా రం  నగరంపల్లిలో  ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం 25 ఏళ్ల కిందట నిర్మించిన  ఇళ్లకు సంపూర్ణ గృహ హక్కుపేరుతో డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. సమావేశంలో మహిళా సంఘ నాయకులు టి.లక్ష్మి, ఎన్‌.ఈశ్వరమ్మ, ఎస్‌.జయలక్ష్మి పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-26T05:22:24+05:30 IST