జీవో-14ను రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-06-24T05:05:49+05:30 IST

గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)కు నష్టం కలిగించే జీవో 14ను తక్షణం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రామ్మూర్తి నాయుడు, వీఆర్‌ఏల సంఘం జిల్లా కార్యదర్శి వై.అప్పలస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం వీఆర్‌ఏల సమ స్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు.

జీవో-14ను రద్దు చేయండి
నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏల సంఘ ప్రతినిధులు

రేగిడి, జూన్‌ 23: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)కు నష్టం కలిగించే జీవో 14ను తక్షణం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రామ్మూర్తి నాయుడు, వీఆర్‌ఏల సంఘం జిల్లా కార్యదర్శి వై.అప్పలస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం వీఆర్‌ఏల సమ స్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. జీవో-14 వీఆర్‌ఏలకు ఇస్తున్న టీఏ, డీఏ లు తొలగిస్తు తీవ్రమైన నష్టం కల్గించిందని, ఇలా చేయడం తగదన్నారు. వీఆర్‌ ఏలకు  పదోన్నతి కోటా 200 శాతం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జగన్‌, పాదాల రావు, పోలిరాజు, భాస్కరరావు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-06-24T05:05:49+05:30 IST