అక్రమ బదిలీలను రద్దు చేయండి

ABN , First Publish Date - 2020-07-12T10:15:03+05:30 IST

ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చే యాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ లక్ష్మిరాజా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు

అక్రమ బదిలీలను రద్దు చేయండి

ప్రొద్దుటూరు టౌన్‌, జూలై 11: ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చే యాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ లక్ష్మిరాజా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం  యూటీఎఫ్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  దొడ్డిదారిన అక్రమ పద్ధతిలో బదిలీలు చేపట్టడం దారుణమని వాటిని రద్దు చేసి షెడ్యూలు ప్రకటించాలని కోరారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు.


అనంతరం యూటీఎఫ్‌ భవన నిర్మాణానికి రాజుపాళెం మండల శాఖ రూ.50 వేలను, ఉపాధ్యాయుడు బాబుల్‌రెడ్డి రూ.5 వేలను విరాళం అందజేశారు.  కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబీర్‌, జిల్లా కార్యదర్శులు లోకేశ్వరరెడ్డి, నాగార్జునరెడ్డి, రవీంద్రుడు, రవికుమార్‌, మహే్‌షబాబు, శ్రీనివాసులు, సుందరం పాల్గొన్నారు.

Updated Date - 2020-07-12T10:15:03+05:30 IST