Advertisement
Advertisement
Abn logo
Advertisement

కెనరా బ్యాంక్... బాండ్ల ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణ

హైదరాబాద్ : రూ. 1,500 కోట్ల సేకరణ లక్ష్యంతో బాండ్లను జారీ చేసిన ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంకు... ఆ మొత్తాన్ని సమీకరించుకుంది. అదనపు టైర్‌-1 బాండ్ల జారీ ద్వారా రూ. 1,500 కోట్ల నిధులను సమీకరణ లక్ష్యంతో... రూ.4,699 కోట్ల మొత్తానికి బిడ్లు వచ్చాయని కెనరా బ్యాంక్‌ తెలిపింది.  అయితే ఏటా 8.05 శాతం కూపన్‌ రేటుతో రూ. 1,500 కోట్ల నిధులను సమీకరించుకోవాలని బ్యాంక్‌ నిర్ణయించింది. బాసెల్-III మూలధనలకణుగుణంగా... ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు తమ మూలధన ప్రణాళిక ప్రక్రియలను మెరుగుపరచుకోవడం కోసమో, లేదంటే బలోపేతం చేసుకోవడం కోసమో అవసరం.


ఆస్తుల నాణ్యత, బ్యాంకుల పనితీరు, అసెట్ క్వాలిటీపై పొటెన్షియల్ ఒత్తిడిని తగ్గించడానికి ఈ నిబంధనలు అమలు చేప్తోన్న విషయం తెలిసిందే. ఇక గృహ రుణాలను వినియోగదారులకు అతి తక్కువ వడ్డీకే అందిస్తున్నట్టు కెనరా బ్యాంక్‌ ప్రకటించింది. గృ రుణాలకు సంబంధించి 6.65 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్‌ పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంటుందని బ్యాంక్‌ పేర్కొంది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయటం ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా గృహరుణానికి దరఖాస్తు చేసుకునే అవకాశంతో పాటు ఇన్‌స్టంట్‌గా ఆమోదం తెలిపే విధానాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Advertisement
Advertisement