వడ్డీ రేట్లు తగ్గించిన కెనరా బ్యాంక్‌

ABN , First Publish Date - 2020-08-07T06:38:12+05:30 IST

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ మరోసారి తన ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించింది. అదనపు నిధుల సమీకరణ వ్యయం ఆధారంగా నిర్ణయించే ఈ వడ్డీ రేట్లను ఆయా కాల పరిమితులను బట్టి శుక్రవారం నుంచి 10 నుంచి 30 బేసిస్‌ పాయింట్ల తగ్గిస్తున్నట్టు తెలిపింది...

వడ్డీ రేట్లు తగ్గించిన కెనరా బ్యాంక్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ మరోసారి తన ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించింది. అదనపు నిధుల సమీకరణ వ్యయం ఆధారంగా నిర్ణయించే ఈ వడ్డీ రేట్లను ఆయా కాల పరిమితులను బట్టి శుక్రవారం నుంచి 10 నుంచి 30 బేసిస్‌ పాయింట్ల తగ్గిస్తున్నట్టు తెలిపింది. నెల రోజల కాల పరిమితి ఉండే ఎంసీఎల్‌ఆర్‌ ఆఽధారిత రుణాలపై వడ్డీ రేటు 7.20 శాతం నుంచి ఏడు శాతానికి, మూడు నెలల కాల పరిమితి ఉండే రుణాలపై 7.45 శాతం నుంచి 7.15 శాతానికి, ఆరు నెలల రుణాలపై 7.5 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గనుంది. ఏడాది కాల పరిమితి ఉండే ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేటునూ 7.55 శాతం నుంచి 7.45 శాతానికి తగ్గించింది. 

Updated Date - 2020-08-07T06:38:12+05:30 IST