రోడ్డు కనపడలేదా?

ABN , First Publish Date - 2021-07-28T06:52:18+05:30 IST

53 అడుగుల వెడల్పు పంట కాల్వను 50 అడుగుల మేర ఆక్రమించేసి రోడ్డు నిర్మిస్తుంటే ఇరిగేషన్‌ అధికారులకు పట్టలేదు.

రోడ్డు కనపడలేదా?
అడ్డుకట్టలు తొలగించిన అనంతరం కాల్వ ఇలా..

కాల్వలో అడ్డు కట్టలు మాత్రమే తొలగింపు 

అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం

53 అడుగుల వెడల్పు పంట కాల్వను 50 అడుగుల మేర ఆక్రమించేసి రోడ్డు నిర్మిస్తుంటే ఇరిగేషన్‌ అధికారులకు పట్టలేదు. అంత పెద్ద కాల్వ మూడు అడుగులకు కుచించుకుపోయినా వారిలో చలనమే లేదు. ‘కాల్వ మాయం’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవ్వడంతో అధికారులు కదిలారు. కానీ రోడ్డును రియల్టర్‌కు వదిలేసి కాల్వలో వేసిన అడ్డుకట్టలను మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు. - కంకిపాడు

Updated Date - 2021-07-28T06:52:18+05:30 IST