Oxygen For India: ఇండో-కెన‌డియ‌న్ సంక్షేమ సంఘాల భారీ సాయం!

ABN , First Publish Date - 2021-05-18T18:04:06+05:30 IST

క‌రోనా సెకండ్ వేవ్‌తో సంక్షోభంలో చిక్కుకున్న భార‌త్‌కు అగ్ర‌రాజ్యం అమెరికా స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా 40కి పైగా దేశాలు త‌మ‌వంతు సాయం చేస్తున్న విష‌యం తెలిసిందే.

Oxygen For India: ఇండో-కెన‌డియ‌న్ సంక్షేమ సంఘాల భారీ సాయం!

టొరంటో: క‌రోనా సెకండ్ వేవ్‌తో సంక్షోభంలో చిక్కుకున్న భార‌త్‌కు అగ్ర‌రాజ్యం అమెరికా స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా 40కి పైగా దేశాలు త‌మ‌వంతు సాయం చేస్తున్న విష‌యం తెలిసిందే. కీల‌క‌మైన వైద్య సామాగ్రి, మెడిసిన్స్ పంపిస్తూ చేదోడుగా నిలుస్తున్నాయి. ఇదే కోవ‌లో తాజాగా ఇండో-కెన‌డియ‌న్ సంక్షేమ సంఘాలు 'Oxygen For India'పేరిట నిర్వ‌హిస్తున్న స్వ‌చ్ఛంద‌ డ్రైవ్ తొలి భాగంలో ఏకంగా 440,220 కెన‌డియ‌న్ డాల‌ర్స్‌( భార‌త క‌రెన్సీలో రూ. 2.66కోట్లు) విరాళాలు సేక‌రించాయి. అక్క‌డి ఇండో-కెనడా ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీసీ), మ‌రో 82 క‌మ్యూనిటీ సంస్థ‌ల‌తో క‌లిసి ఆదివారం ఈ డ్రైవ్ చేప‌ట్టింది. మూడు గంట‌ల పాటు కొన‌సాగిన ఈ డ్రైవ్‌లో రూ. 2.66కోట్ల విరాళాలు అందాయి. వీటితో ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు కొనుగోలు చేసి, భార‌త్‌కు పంపించాల‌ని ఐసీసీసీ నిర్ణ‌యించింది. వ‌చ్చే నాలుగు వారాలు కూడా 'Oxygen For India' డ్రైవ్ ద్వారా విరాళాలు సేక‌రించ‌నున్న‌ట్లు ఐసీసీసీ వెల్ల‌డించింది. క‌రోనాతో పోరాడుతున్న మాతృదేశానికి త‌మ‌వంతు సాయం చేస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ఇండో-కెన‌డియ‌న్ సంక్షేమ సంఘాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2021-05-18T18:04:06+05:30 IST