Abn logo
Jan 23 2021 @ 21:17PM

‘మా నాన్నకు 27 మంది భార్యలు..’ టీనేజర్ వీడియో వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: ‘మా నాన్నకు 27 మంది భార్యలు.. ఒక్క ఇంట్లో ఇద్దరు..’ అంటూ తన కుంటుంబం గురించి ఓ టీనేజర్ చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. యావత్ ప్రపంచంలో ఇంతమంది భార్యలున్న ఓకే ఒక వ్యక్తి ఇతడేనా అనే సందేహం నెటిజన్లలో కలుగజేస్తోంది. కెనడాకు చెందిన మెర్లిన్ బ్లాక్ మూర్(19) టీకా‌టాక్ వీడియో ద్వారా ఈ విషయాల్ని పంచుకున్నాడు. అయితే..సొంత తల్లిని తాము మామ్ అని పిలుస్తామని, మిగతావారిని మదర్ అని సంబోధిస్తామని అతడు చెబుతున్నాడు. తనకు టీనేజ్ వయసులో ఉన్న తోబుట్టువులే 150 మంది ఉన్నారని, వీరందరినీ హోటల్‌ను పోలిన ఓ ప్రత్యేక భవంతిలో ఉంచుతారని కూడా అతడు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. ఇద్దరు భార్యలకు ఓ ఇంటి చొప్పున తన తండ్రి కేటాయించాడని అతడు చెప్పుకొచ్చాడు. 

నలుగురిలో నవ్వులపాలవుతామనే ఉద్దేశ్యంతోనే తాను ఇంతకాలం ఈ వివరాలను గోప్యంగా ఉంచానని కూడా మెర్లిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం మెర్లిన్‌తో పాటూ అతడి ఇద్దరు అన్నలూ కూడా తమ కుటుంబానికి దూరంగా అమెరికాలో నివసిస్తున్నారు. ‘ఈ విషయాల గురించి చర్చించాలని ఎప్పటి నుంచో అనుకునేవాడిని. ఇన్నాళ్లకు ఆ స్థితికి చేరుకున్నాను. ఇక ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది’ అని మెర్లిన్ తన వీడియోలు వ్యాఖ్యానించాడు. మెర్లిన్‌, అతడి అన్న వారెన్(21) కూడా ఈ విషయాలను సోషల్ మీడియాలోనూ వెల్లడించారు. ఇంత పెద్ద కుటుంబం కావడంతో తామంతా స్వతంత్రంగా జీవనం గడపగలిగేవారమని, తమ పంటను తామే పండించుకునేవారమని, వ్యవసాయానికి సంబంధించి పిల్లలు వివిధ బాధ్యతలు చేపట్టేవారని చెప్పుకొచ్చారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ 27 మంది భార్యల్లో సొంత అక్కచెళ్లెల్లు కూడా ఉన్నారు. ఈ విడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement