కెనడా నుంచి అమృత్‌సర్‌కు.. డైరెక్ట్ విమాన సర్వీసులు కోరుతున్న ప్రవాసులు

ABN , First Publish Date - 2021-04-11T20:40:15+05:30 IST

కెనడాలోని పంజాబీ ప్రవాసులు, భారత్‌లోని ఎన్‌జీఓ‌లు.. వాంకోవర్, టోరంటో నుంచి అమృత్‌సర్‌‌లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఎస్‌జీఆర్‌డీజెఐ) డైరెక్ట్ విమాన సర్వీసులు నడిపించాలని కోరుతున్నారు.

కెనడా నుంచి అమృత్‌సర్‌కు.. డైరెక్ట్ విమాన సర్వీసులు కోరుతున్న ప్రవాసులు

అమృత్‌సర్‌: కెనడాలోని పంజాబీ ప్రవాసులు, భారత్‌లోని ఎన్‌జీఓ‌లు.. వాంకోవర్, టోరంటో నుంచి అమృత్‌సర్‌‌లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఎస్‌జీఆర్‌డీజెఐ) డైరెక్ట్ విమాన సర్వీసులు నడిపించాలని కోరుతున్నారు. అమృత్‌సర్‌‌లో జన్మించిన గురు తెఘ్ బహదూర్(సిక్కుల తొమ్మిదో గురు) 400వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రవాసులు ఈ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ఇప్పటిది కాదని, చాల ఏళ్లుగా ప్రవాసులు ఈ విషయమై అభ్యర్థిస్తున్నట్లు ఫ్లై అమృత్‌సర్ ఇనిషియేటివ్ కన్వీనర్ సమీప్ సింగ్ గుమ్తాలా తెలిపారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి ప్రతియేటా కెనడాలోని వాంకోవర్, టోరంటో నుంచి లక్షలాది మంది ప్రవాసులు వస్తుంటారని, అలాగే ఇక్కడి నుంచి కూడా కెనడాకు చాలా మంది రాకపోకలు సాగిస్తుంటారని వారికి ఈ డైరెక్ట్ విమాన సర్వీసులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సమీప్ సింగ్ చెప్పుకొచ్చారు. గతేడాది మార్చిలో ఈ విషయమై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు పలువురు ఎంపీలకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-04-11T20:40:15+05:30 IST