Viral News: ప్రముఖ సంస్థ ఉద్యోగ ప్రకటన..ఏడాదికి రూ.61లక్షల జీతం.. 5ఏళ్లు పైబడిన పిల్లలూ అప్లై చేసుకోవచ్చు!

ABN , First Publish Date - 2022-08-03T21:03:58+05:30 IST

కెనడాకు చెందిన ప్రముఖ ఓ ప్రముఖ సంస్థ భారీ మొత్తంలో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఆ ఉద్యోగం కోసం 5ఏళ్లు పైబడిన పిల్లల దగ్గర నుంచి వయసులో పెద్ద వారు కూడా అప్లై చేసుకుంటున్నారు. ఏంటీ.. ఐదేళ్లు పైబడిన పిల్ల

Viral News: ప్రముఖ సంస్థ ఉద్యోగ ప్రకటన..ఏడాదికి రూ.61లక్షల జీతం.. 5ఏళ్లు పైబడిన పిల్లలూ అప్లై చేసుకోవచ్చు!

ఎన్నారై డెస్క్: ఓ ప్రముఖ సంస్థ భారీ మొత్తంలో జీతం ఆఫర్ చేస్తూ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన నెట్టింట వైరల్ కావడంతో.. ఉద్యోగం కోసం 5ఏళ్లు పైబడిన పిల్లల దగ్గర నుంచి వయసులో పెద్ద వారు కూడా అప్లై చేసుకుంటున్నారు. ఏంటీ.. ఐదేళ్లు పైబడిన పిల్లలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోతున్నారా? నమ్మశక్యంగా లేకున్నా.. ఇది నిజమే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జాబ్‌కు సెలక్ట్ అయిన వారికి ఏడాదికి ఏకంగా రూ.61లక్షల జీతం పొందొచ్చు. ఇంతకూ ఉద్యోగం పొందిన వ్యక్తి చేయాల్సిన పనేంటనేగా మీ డౌటు.. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. 


కెనడాలో(Canada) ని ఒంటారియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న క్యాండీ ఫన్‌హౌస్(Candy Funhouse) అనే సంస్థ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. Candy Funhouse చీఫ్ క్యాండీ ఆఫీసర్(Chief candy officer) హోదాలో పని చేయడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతుంది. 5ఏళ్లపైబడిన పిల్లలు దగ్గర నుంచి ఏ వయసు వారైనా ఈ ఉద్యోగం అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి ఏటా 1,00,000 కెనడియన్ డాలర్లు(అంటే భారత కరెన్సీలో సుమారు రూ.61లక్షలు) జీతంగా చెల్లించనున్నట్టు తెలిపింది. ఇంతకూ ఆ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి ఏం పని చేయాలో చెప్పలేదు కదూ. ఏం లేదండి.. ఆ కంపెనీలో తయారయ్యే క్యాండీల(Candies)ను టేస్ట్ చేసి.. ఎలా ఉన్నాయో చెప్పాలి అంతే. టేస్ట్ టెస్టర్‌గా రోజుకు 117 క్యాండీల చొప్పున ఏడాదికి 3500 క్యాండీలను తినాల్సి ఉంటుంది.


కాగా.. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ (Viral in Social Media) అవుతుండటంతో.. ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. రోజుకు 117 తినాలంటే కష్టమే అనుకుంటూనే.. ధైర్యం చేసి అప్లై చేసేస్తున్నారు. Candy Funhouse ప్రతినిధి మాట్లాడుతూ.. ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు వస్తాయని ఊహించలేదని పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఆగస్టు 31వ గడవు ఉన్నందున అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. 




Updated Date - 2022-08-03T21:03:58+05:30 IST