146 ఏళ్ల కెన‌డా సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో సరికొత్త అధ్యాయం.. భార‌త మూలాలున్న వ్య‌క్తికి..

ABN , First Publish Date - 2021-06-18T20:09:56+05:30 IST

146 ఏళ్ల కెన‌డా సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో సరికొత్త అధ్యాయం న‌మోదైంది.

146 ఏళ్ల కెన‌డా సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో సరికొత్త అధ్యాయం.. భార‌త మూలాలున్న వ్య‌క్తికి..

ఒట్టావా: 146 ఏళ్ల కెన‌డా సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో సరికొత్త అధ్యాయం న‌మోదైంది. గురువారం ఆ దేశ ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో తొలిసారి శ్వేత‌జాతీయుడిని కాకుండా వేరే వ్య‌క్తిని సుప్రీంకోర్టు జ‌డ్జిగా నామినేట్ చేశారు. 146 ఏళ్లుగా సుప్రీంకోర్టు జ‌డ్జిలుగా తెల్ల‌జాతీయులు మాత్ర‌మే కొన‌సాగుతున్నారు. ఇక తొలిసారి సుప్రీంకోర్టు జ‌డ్జిగా నామినేట్ అయిన మ‌హ‌మూద్ జ‌మాల్‌కు భార‌త్‌లోని గుజ‌రాత్ మూలాలు ఉండ‌డం విశేషం. ప్ర‌స్తుతం జ‌మాల్ 2019 నుంచి ఒంటారియో కోర్టు ఆఫ్ అప్పీల్ జ‌డ్జిగా కొన‌సాగుతున్నారు. "కెన‌డా సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో ఇదో చారిత్రాత్మ‌క ఘ‌ట్టం" అని జ‌మాల్ నామినేష‌న్‌ను ఉద్దేశిస్తూ ప్ర‌ధాని ట్రూడో ట్వీట్ చేశారు. కాగా, గుజ‌రాత్‌కు చెందిన జ‌మాల్ త‌ల్లిదండ్రులు 1969లో మొద‌ట బ్రిట‌న్ వల‌స వెళ్లారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ‌ శ‌రీర వ‌ర్ణం కార‌ణంగా త‌మ ఫ్యామిలీ ఎదుర్కొన్న అవ‌మానాల‌ను ఈ సంద‌ర్భంగా జ‌మాల్ గుర్తు చేశారు. అనంత‌రం 1981లో యూకే నుంచి కెన‌డాకు వ‌చ్చిన‌ట్లు జమాల్ తెలిపారు. ఇక్క‌డికి వ‌చ్చిన తొలినాళ్ల‌లో కూడా ఇలాగే వ‌ర్ణ వివ‌క్ష‌త‌కు గురైన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానానికి జ‌డ్జిగా నామినేట్ కావ‌డం ఎంతో గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు.  


Updated Date - 2021-06-18T20:09:56+05:30 IST