కొవిడ్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రజలు మాస్కులు ధరించాలి

ABN , First Publish Date - 2022-03-19T18:31:56+05:30 IST

కెనడా దేశంలో కొవిడ్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రజలు మాస్క్ లు ధరించాలని ఆరోగ్యశాఖ అధికారులు సలహా ఇచ్చారు....

కొవిడ్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రజలు మాస్కులు ధరించాలి

Canadaలో తాజాగా ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాలు

టొరంటో(కెనడా): ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కెనడా దేశంలో వైద్యాధికారులు కరోనా వ్యాప్తిచెందకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కెనడా దేశంలో కొవిడ్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రజలు మాస్క్ లు ధరించాలని ఆరోగ్యశాఖ అధికారులు సలహా ఇచ్చారు. గతంలో మానిటోబా, బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, ఇతర ప్రావిన్సుల్లో మాస్క్ ధరించాలనే ఆదేశాలు తొలగించారు.తాజాగా కరోనా వైరస్ పరిణామం చెందుతున్నందున ప్రజలు వ్యాక్సిన్లు తీసుకోవడంతో పాటు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కెనడా చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ థెరిసా టామ్ సూచించారు.


Updated Date - 2022-03-19T18:31:56+05:30 IST