వ్యాక్సిన్ వేసుకుని.. సంప్రదాయ నృత్యంతో అదరగొట్టాడు!

ABN , First Publish Date - 2021-03-05T06:03:02+05:30 IST

వాతావరణ పరిస్థితుల కారణంగా పూర్తిగా గడ్డకట్టుకునిపోయిన సరస్సుపై ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్‌కు సంబంధిం

వ్యాక్సిన్ వేసుకుని.. సంప్రదాయ నృత్యంతో అదరగొట్టాడు!

ఒట్టావా: వాతావరణ పరిస్థితుల కారణంగా పూర్తిగా గడ్డకట్టుకునిపోయిన సరస్సుపై ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. అతని సంతోషానికి కారణం తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని బలి తీసుకుంది. కొవిడ్-19 అరికట్టే వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో ప్రపంచంలోని చాలా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియనకు ప్రారంభించాయి. ఈ జాబితాలో కెనడా కూడా ఉంది. ఈ క్రమంలో కెనడాకు చెందిన సంప్రదాయ నృత్య శిక్షకుడు గురుదీప్ పాంధర్.. తాజాగా కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యాక్సిన్ పొందిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని భావించారు. ఇందులో భాగంగా పూర్తిగా గడ్డకట్టుకునిపోయిన సరస్సు‌పై పంజాబీ సంప్రదాయ నృత్యమైన భాంగ్రాను ప్రదర్శించారు. అంతేకాకుండా దానికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 




Updated Date - 2021-03-05T06:03:02+05:30 IST