కెనడాలో ప్రవేశించే విమాన ప్రయాణికులకు కొవిడ్-19 పరీక్షలు

ABN , First Publish Date - 2020-10-23T10:52:39+05:30 IST

కెనడా దేశంలో ప్రవేశించే అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయంలోనే కొవిడ్ -19 పరీక్షలు చేసి...

కెనడాలో ప్రవేశించే విమాన ప్రయాణికులకు కొవిడ్-19 పరీక్షలు

ఒట్టావా (కెనడా): కెనడా దేశంలో ప్రవేశించే అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయంలోనే కొవిడ్ -19 పరీక్షలు చేసి క్వారంటైన్ చేయాలని ఆ దేశ సర్కారు తాజాగా నిర్ణయించింది. కెనడియన్లను కరోనా నుంచి రక్షించేందుకు వీలుగా కెనడా ప్రభుత్వం  అంతర్జాతీయ ప్రయాణికులకు  కరోనా పరీక్షలు చేసి 14రోజుల పాటు క్వారంటైన్ చేసేలా పైలెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. నవంబరు 2వతేదీ నుంచి స్వీట్ గ్రాస్, మోంటానా, కౌట్స్, అల్బెర్టా, కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి కెనడాలోకి ప్రవేశించే అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్ష చేయిస్తారు. 


కొవిడ్ నెగిటివ్ అని వస్తేనే దేశంలోకి అనుమతించి క్వారంటైన్ కు పంపిస్తామని కెనడా ఇంటర్ గవర్నమెంటల్ విభాగం వ్యవరాల శాఖ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల కెనడాలో విదేశీ పౌరుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఈ ఏడాది మార్చి నెలలో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ప్రస్థుతం దాన్ని సడలించి విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కొవిడ్ పరీక్షలు చేసి, క్వారంటైన్ చేసేలా పైలెట్ కార్యక్రమాన్ని కెనడా సర్కారు చేపట్టింది. 

Updated Date - 2020-10-23T10:52:39+05:30 IST