Abn logo
Feb 18 2020 @ 10:05AM

1.39 లక్షల మంది భారత విద్యార్థులకు కెనడా స్టడీ పర్మిట్‌లు

ఒట్టావా (కెనడా) : 2019 వ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1.39 లక్షల మంది భారత విద్యార్థులకు కెనడా దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు స్టడీ పర్మిట్‌లు జారీ చేశారు. 2019లో కెనడా 4 లక్షల మంది విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు జారీ చేయగా వాటిలో 1.39 లక్షల మంది భారతీయ విద్యార్థులు కావడం విశేషం. కెనడాలో చదువుకునేందుకు స్టడీ పర్మిట్లు పొందిన భారత విద్యార్థుల శాతం 34.5 శాతంగా నిలిచింది. కెనడాలో చదివే విదేశీ విద్యార్థుల్లో మన భారత విద్యార్థులే ఎక్కువ కావడం విశేషం. ఆ తర్వాత చైనా దేశస్థులు 21 శాతం మంది కెనడాలో చదువుతున్నారు. 2018లో కెనడా 3.55 లక్షల స్టడీ పర్మిట్లు విదేశీ విద్యార్థులకు జారీ చేసింది. 2018 కంటే 2019లో కెనడా 13.8 శాతం ఎక్కువగా విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు జారీ చేసింది. కెనడాలో చదువుకునేందుకు భారత విద్యార్థుల సంఖ్య పెరగడంతో చైనా వారి సంఖ్య తగ్గింది. 2019లో చైనా దేశానికి చెందిన 84,710 మంది విద్యార్థులు కెనడాలో స్టడీ పర్మిట్లు తీసుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement