Canada గుడ్‌న్యూస్.. భారత ప్రయాణికులకు తప్పిన తిప్పలు!

ABN , First Publish Date - 2022-01-29T21:24:31+05:30 IST

భారత ప్రయాణికులకు కెనడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొవిడ్ నిబంధనలను సడలించింది. సవరించిన ఈ నిబంధనలు జనవరి 28 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి

Canada గుడ్‌న్యూస్.. భారత ప్రయాణికులకు తప్పిన తిప్పలు!

ఎన్నారై డెస్క్: భారత ప్రయాణికులకు కెనడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొవిడ్ నిబంధనలను సడలించింది. సవరించిన ఈ నిబంధనలు జనవరి 28 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు తిరిగి కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కెనడా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా బయల్దేరడానికి 18 గంటల ముందు కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్‌ను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేస్తేనే ప్రయాణానికి అనుమతి ఇస్తామని తేల్చి చెప్పింది. నేరుగా కాకుండా మూడో దేశం మీదుగా వచ్చే ప్రయాణికులైతే.. మార్గమధ్యంలోని ఎయిర్‌పోర్టులో కూడా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పింది. 



ఈ నిబంధనల కారణంగా భారత ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లోని క్వారెంటైన్ కేంద్రాలకు వెళ్లి అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది.  అయితే తాజాగా కెనడా ప్రభుత్వం ఈ నిబంధనలను సవరించింది. నేరుగా లేదా మూడో దేశం ద్వారా వచ్చే భారత ప్రయాణికులు.. తమ ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ పొందితే చాలని ప్రకటించింది. ఈ మినహాయింపు మొరాకో కూడా వర్తిస్తుందని వెల్లడించింది. 




Updated Date - 2022-01-29T21:24:31+05:30 IST