కెనడాలో త్వరలో కొత్త రూల్.. విదేశీయులు రెండేళ్ల పాటు ఇళ్లు కొనద్దంటూ..

ABN , First Publish Date - 2022-04-09T01:55:32+05:30 IST

కెనడాలో నానాటికీ పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ ధరలు కళ్లెం వేసేందుకు కెనడా ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేసింది. విదేశీ పెట్టుబడి దారులు రెండేళ్ల పాటు కెనడాలో ఇల్లు కొనకుండా త్వరలో నిషేధం విధించనున్నట్టు పేర్కొంది.

కెనడాలో త్వరలో కొత్త రూల్.. విదేశీయులు  రెండేళ్ల పాటు ఇళ్లు కొనద్దంటూ..

ఎన్నారై డెస్క్: కెనడాలో నానాటికీ పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ ధరలకు కళ్లెం వేసేందుకు కెనడా ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేసింది. విదేశీ పెట్టుబడి దారులు రెండేళ్ల పాటు కెనడాలో ఇల్లు కొనకుండా త్వరలో నిషేధం విధించనున్నట్టు  పేర్కొంది. ‘రియల్’ ధరల పెరుగుదలకు బ్రేకులు వేయాలంటూ ప్రజల నుంచి ఇటీవల కాలంలో ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. అంతేకాకుండా.. ఇళ్లు కొన్న ఏడాదిలోపే అమ్మేసేవారిపై కూడా అధిక మొత్తంలో పన్ను విధించేందుకు సిద్ధమైంది.


అయితే.. కెనడాలో శాశ్వతనివాసార్హత ఉన్నవాళ్లకు, విదేశీ విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గతేడాది కెనడాలో రియల్ ధరలు ఏకంగా 20 శాతం మేర పెరిగాయి. ఇళ్ల అద్దెలు కూడా ఇదే స్థాయిలో అధికమయ్యాయి. ధరలకు కళ్లెం వేసేందుకు చెప్పట్టబోతున్న వివిధ చర్యలను ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్ ఇటీవల ప్రవేశపెట్టిన ఫెడరల్ బడ్జెట్‌లో పేర్కొన్నారు. 


Updated Date - 2022-04-09T01:55:32+05:30 IST