ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్తున్నారా.. అక్కడి ప్రభుత్వం జారీ చేసిన ఈ తాజా సూచన మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-10-07T02:55:19+05:30 IST

ఉన్నత విద్యను అభ్యసించడానికి ఏటా వేలాది మంది భారత విద్యార్థులు కెనడా వెళ్తుంటారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. తాజాగా భారత విద్యార్థులను ఉద్దేశించి.. కెనడా ప్ర

ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్తున్నారా.. అక్కడి ప్రభుత్వం జారీ చేసిన ఈ తాజా సూచన మీకు తెలుసా?

ఎన్నారై డెస్క్: ఉన్నత విద్యను అభ్యసించడానికి ఏటా వేలాది మంది భారత విద్యార్థులు కెనడా వెళ్తుంటారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. తాజాగా భారత విద్యార్థులను ఉద్దేశించి.. కెనడా ప్రభుత్వ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జాబ్ చేస్తూ చదువుకోవాలనుకునే విద్యార్థులకు కీలక సూచనలు ఇచ్చారు.


కెనడాలో మరికొద్ది రోజుల్లో వింటర్ టర్మ్‌ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ విద్యా సంవత్సరంలో భాగంగా కెనడా వచ్చే భారత విద్యార్థులు... ముందుగా తమ తమ కాలేజీల్లో అడ్మిట్ కావాలని అధికారులు చెప్పారు. కాలేజీలో కోర్సు ప్రారంభమైన తర్వాత మాత్రమే.. నిబంధనల ప్రకారం ఉద్యోగాలు చేయాలని వెల్లడించారు. కాలేజీల్లో కోర్సు మొదలవకముందే.. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లో చేరవద్దని స్పష్టం చేశారు. ‘కొన్ని స్టడీ పర్మిట్‌లు కెనడాలో చదువుకుంటూ ఉద్యోగాలు చేయడానికి అనుమతిస్తాయి. ఇటువంటి స్టడీ పర్మిట్‌లు పొందిన విద్యార్థులు.. కాలేజీలో కోర్సు ప్రారంభమైన తర్వాత మాత్రమే ఉద్యోగాల్లో చేరాలి. ఎట్టి పరిస్థితుల్లో కోర్సు ప్రారంభానికి ముందు ఉద్యోగాల్లో జాయిన్ కాకూడదు. అలాగే కెనడాకి చేరుకున్న వెంటనే బార్డర్ సర్వీసెస్ అధికారితో ధ్రువపత్రాలను వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఏదైనా కారణాల వల్ల విద్యార్థులు ఆలస్యంగా కెనడాకు చేరుకోవడానికి సంబంధిత కాలేజీలు అనుమతి ఇస్తే అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను కూడా చూపించాల్సి ఉంటుంది’ అంటూ సోషల్  మీడియా వేదికగా భారత విద్యార్థులను ఉద్దేశించి కెనడా అధికారులు పోస్ట్ పెట్టారు. 


Updated Date - 2022-10-07T02:55:19+05:30 IST