కెనడాలో 12ఏళ్ల పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-05-06T10:59:37+05:30 IST

కెనడాలో 12 నుంచి 16ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్‌ తయారీ కరోనా టీకా వేయడానికి ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ బుధవారం అనుమతినిచ్చింది. 16ఏళ్లు పైబడిన వారికి ఆ టీకా వేయడానికి అనుమతించిన సరిగ్గా నెల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

కెనడాలో 12ఏళ్ల పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌

టొరంటో: కెనడాలో 12 నుంచి 16ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్‌ తయారీ కరోనా టీకా వేయడానికి ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ బుధవారం అనుమతినిచ్చింది. 16ఏళ్లు పైబడిన వారికి ఆ టీకా వేయడానికి  అనుమతించిన సరిగ్గా నెల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. 18 ఏళ్ల వారితో పోల్చుకుంటే 12 నుంచి 15ఏళ్ల వయసు వాళ్లలో టీకా తీసుకొన్న తర్వాత దుష్ప్రభావాలు ఏమీ కనిపించలేదని ఈ మార్చిలో విడుదల చేసిన నివేదికలో ఫైజర్‌ తెలిపింది. కౌమారదశ వాళ్లకంటే చిన్న పిల్లల్లో.. ముఖ్యంగా రెండో డోసు వేసిన తర్వాత నొప్పులు, జ్వరం, నిస్తత్తువ వంటివి కనిపించాయని పేర్కొంది. దీనిపై అధ్యయనం జరగుతోందని తెలిపింది. ఇప్పటి వరకూ దేశ జనాభాలో 34శాతం మంది మొదటి మోతాదు తీసుకొన్నారు. కాగా, అమెరికా కూడా వచ్చే వారంలో ఫైజర్‌కు అనుమతినిచ్చే అవకాశం ఉంది. పాఠశాలలు పునఃప్రారంభించేనాటికి పిల్లలకు వ్యాక్సిన్‌ పూర్తి చేయాలని అమెరికా భావిస్తోంది.

Updated Date - 2021-05-06T10:59:37+05:30 IST