Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 25 Oct 2021 19:17:45 IST

Shah Rukh Khan పక్కన ఉన్న ఈ పిల్లోడు.. ఇప్పుడో సెన్సేషన్.. ఎవరో గుర్తు పట్టగలరా..?

twitter-iconwatsapp-iconfb-icon
Shah Rukh Khan పక్కన ఉన్న ఈ పిల్లోడు.. ఇప్పుడో సెన్సేషన్.. ఎవరో గుర్తు పట్టగలరా..?

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే రెండు దేశాల్లోనూ ఉద్రిక్త, ఉద్వేగ వాతావరణం నెలకొంటుంది. అయితే, అక్టోబర్ 24, ఆదివారం కూడా అదే జరిగింది. టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో భాగంగా దాయాది దేశాలు తలపడ్డాయి. అయితే, రొటీన్‌కి భిన్నంగా ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి పాక్ గెలిచింది. గతంలో ప్రతీసారి ఇండియానే పైచేయి సాధించేది. మొదటిసారి పాక్ విజయాన్ని రుచి చూసింది. కాకపోతే, అందరి దృష్టీ ఇండియా, పాకిస్థాన్ క్రికెటర్లపై ఉంటే... కొందరు నెటిజన్స్ మాత్రం షారుఖ్ ఖాన్ ఓల్డ్ ఫోటో ఒక దాన్ని వైరల్ చేశారు! కారణం... అది ఒకప్పటి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సమయంలోనిదే! పైగా అందులో చిన్ననాటి ఆర్యన్ కూడా ఉండటం, మరో విశేషం... 


2007లో షారుఖ్ నటించిన ‘చక్ దే ఇండియా’ సినిమా విడుదలైంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. వెంటనే టీ20 వరల్డ్ కప్ చోటు చేసుకుంది. టీమ్ ఇండియాని చీర్ అప్ చేసేందుకు మన వాళ్లు ‘చక్ దే’ టైటిల్ సాంగ్‌ని విపరీతంగా వాడారు. అయితే, అప్పుడు కూడా ఇండియా, పాకిస్థాన్ తలపడటంతో హై టెన్షన్ ఏర్పడింది. షారుఖ్ సహజంగానే ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటానికి స్టేడియంకి చేరుకున్నాడు. ఇండియాని సపోర్ట్ చేస్తూ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ హల్ చల్ చేశాడు. సరగ్గా అప్పుడు తీసిన ఫోటోనే ఇప్పుడు వైరల్‌గా మారింది.


షారుఖ్ ఖాన్ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చూడటం, జాతీయ జెండా ప్రదర్శించటం... వింతో, విశేషమో కాదు. కానీ, అతడి పక్కన ఓ తొమ్మిదేళ్ల కుర్రాడున్నాడు. అతడే నెటిజన్స్‌లో ఆసక్తి, ఆశ్చర్యం రేకెత్తించాడు. ఎందుకంటే, అతను ప్రస్తుతం డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ కాబట్టి! అప్పటికి పదేళ్లు కూడా లేని స్టార్ కిడ్ నాన్నతో కలసి మ్యాచ్ చూసేందుకు స్టేడియంకి వచ్చాడు. కానీ, అతనే దురదృష్టవశాత్తూ ఆదివారం నాటి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ వేళ... జైల్లో ఉండాల్సి వచ్చింది. 2007 నాటి హ్యాపీ కింగ్ ఖాన్ రైట్ నౌ... కొడుకు విషయంలో చాలా టెన్షన్‌గా ఉన్నాడు. చూడాలి మరి, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో... 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...