Advertisement
Advertisement
Abn logo
Advertisement

మిగిలిపోయిన ఆహారం తినొచ్చా?

ఆంధ్రజ్యోతి(20-07-2020)

ప్రతి ఇంట్లో అందరికీ ఎదురయ్యే సమస్యే ఇది. కూరలు, పప్పులు మిగిలిపోతుంటాయి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టి తినేవాళ్లు ఉంటారు. అలా తినడం వల్ల రోగాల బారిన పడతామని వాదించే వాళ్లు ఉంటారు. అసలు అలా ముందురోజు మిగిలిన ఆహారాన్ని తినొచ్చో లేదో తెలుసుకుందాం.  కూరగాయలు, ఆకుకూరలతో వండిన వంటకాలు మిగిలితే మరుసటి రోజు వేడి చేసుకుని చక్కగా తినొచ్చు. కాకపోతే ఆ కూరని ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు గాలి చొరబడని కంటైనర్లలో పెట్టి దాచాలి. అంతేకాదు ఆ కూరలో ఉల్లిపాయలు వేయకుండా వండితే మంచిది. ఉల్లిపాయ వేసిన కూరలు త్వరగా పాడవుతాయి. ముఖ్యంగా నీళ్లు లేకుండా వండిన వేపుళ్లు మరుసటి రోజుకు దాచుకుని వేడి చేసుకుని తిన్నా ఏం కాదు. బ్రెడ్‌ విషయానికి వస్తే ఫ్రిజ్‌లో పెట్టి వారం రోజుల వరకు వాడుకోవచ్చు. హోమ్‌ మేడ్‌ బ్రెడ్‌ అయితే మూడు నాలుగు రోజుల వరకు వాడొచ్చు. వండిన అన్నం త్వరగా పాడైపోతుంది. ఫ్రిజ్లో పెట్టినా కూడా కొన్ని విషకారకాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి మిగిలిన అన్నాన్ని తినకపోవడమే ఉత్తమం. 


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...