Can This Blood Test Indicate a Heart Attack? ఈ రక్త పరీక్ష గుండెపోటును ముందుగానే గుర్తిస్తుందా?

ABN , First Publish Date - 2022-09-27T16:45:28+05:30 IST

గుండెపోటు రాబోయే లక్షణాలను ముందుగానే ఈ రక్త పరీక్షతో గుర్తించవచ్చా? రక్త పరీక్షతో ఒక వ్యక్తి గుండె సమస్యలను తెలుసుకోవడం సాధ్యమేనా?

Can This Blood Test Indicate a Heart Attack? ఈ రక్త పరీక్ష గుండెపోటును ముందుగానే గుర్తిస్తుందా?

గుండెపోటు రాబోయే లక్షణాలను ముందుగానే ఈ రక్త పరీక్షతో గుర్తించవచ్చా? రక్త పరీక్షతో ఒక వ్యక్తి గుండె సమస్యలను తెలుసుకోవడం సాధ్యమేనా? అవుననే అంటున్నారు వైద్య నిపుణులు.


ఈ మధ్య కాలంలో ఎందరో ప్రముఖులు గుండెపోటుతో చనిపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. వయసుతో సంబంధం లేకుండా వీళ్ళు గుండెపోటుకు బలైపోయారు. గత రెండేళ్ళలో గుండెపోటుకు గురైన వారిలో అన్నివయసులవారూ ఉన్నారు. తరచుగా వ్యాయామం చేసే వ్యక్తులు కూడా గుండె ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని అంచనా వేయలేము. ఇక ఈ మధ్య కాలంలో అగస్మాత్తుగా మరణించిన ప్రముఖులలో ఎక్కువ మంది మంచి ఆరోగ్యంతో నిత్యం వ్యాయామాన్ని చేసేవారే కావడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని రక్త పరీక్షతో నిర్థారించే టెస్ట్ ను కార్డియో సి రియాక్టివ్ ప్రోటీన్ cardio C-reactive protein (hs- CRP) అని అంటారు. 


కార్డియో సి రియాక్టివ్ ప్రోటీన్ అంటే ఏమిటి?

హై-సెన్సిటివ్ సి-రియాక్టివ్ ప్రోటీన్ (హెచ్‌ఎస్ సిఆర్‌పి), సాధారణంగా కార్డియో సి-రియాక్టివ్ ప్రోటీన్ అని పిలుస్తారు, ఇది రక్త పరీక్ష. CRP అనేది ఇన్ఫ్లమేటరీ మార్కర్, అంటే శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నా రక్తంలో CRP స్థాయి పెరుగుతుంది.  నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో కార్డియో-థొరాసిక్, వాస్కులర్ సర్జన్ తెలిపిన వివరాల ప్రకారం హెచ్‌ఎస్ సిఆర్‌పి ప్రామాణిక సిఆర్‌పి కంటే ఎక్కువ సున్నితమైనది.. ఇది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో hs CRP స్థాయి ఎక్కువగా ఉందని అనుకుంటే  ఆ వ్యక్తి భవిష్యత్తులో చేతులు, కాళ్ళలో ధమని అడ్డంకులు(blockages) భవిష్యత్తులో గుండెపోటులు, స్ట్రోక్స్ , కార్డియాక్ అరెస్ట్‌తో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఇది హెచ్చరికగా పనిచేస్తుంది.


ఈ టెస్ట్ దేనికి ఉపయోగపడుతుంది.

వాపు కలిగించే అనారోగ్యాలను గుర్తించడానికి ట్రాక్ చేయడానికి CRP పరీక్షను చేస్తారు. 

1. సెప్సిస్ వంటి బాక్టీరియల్ ఇన్పెక్షన్లను తీవ్రమైన అనారోగ్యాలు.

2. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.

3. పేగు వాపు, రక్తస్రావానికి దారితీసే అనారోగ్యాన్ని ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి అంటారు.

ఈ పరీక్ష ఫలితాలు అధిక స్థాయి CRP ని బహిర్గతం చేస్తే, శరీరం ఎర్రబడినట్లు కనిపిస్తుంది. అయినా వాపు ఉన్న ప్రాంతాన్ని గుర్తించలేకపోవచ్చు. పొగాకు తీసుకోవడం, అధిక బరువు, వ్యాయామం చేయకపోవడం వంటివి కూడా CRP స్థాయిలను పెంచే అవకాశం ఉంది. 

Updated Date - 2022-09-27T16:45:28+05:30 IST