మనుషులు... 150 ఏళ్లు బతుకుతారా ?

ABN , First Publish Date - 2021-06-04T00:52:27+05:30 IST

ఎవరు ఎక్కువ కాలం జీవించారు ? ఎందుకు ? అన్న విషయమై సింగపూర్‌లో ఓ పరిశోధకుల బృందం.. పరిశీలిస్తోంది.

మనుషులు... 150 ఏళ్లు బతుకుతారా ?

లండన్ : ఎవరు ఎక్కువ కాలం జీవించారు ? ఎందుకు ? అన్న విషయమై  సింగపూర్‌లో ఓ పరిశోధకుల బృందం.. పరిశీలిస్తోంది. ఈ క్రమంలో... ఆసక్తికరమైన విషయాలను ఆ బృందం చెబుతోంది. ఇక వారి పరిశోధనలెలా సాగుతున్నా, వాటికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉండనున్నా... కొన్ని విషయాలు మాత్రం ఆసక్తిని రేపుతున్నాయి. ఆ వివరాలిలా ఉన్నాయి. 


 వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందుతున్నా... చావును జయించడం సాధ్యపడదన్నదే ఎవరి అభిప్రాయమైనా. ఇక విషయానికొస్తే...  సింగపూర్‌లో ‘గెరో’ అనే బయోటెక్ కంపెనీ ఉంది. అది నేచర్ కమ్యూనికేషన్ పాయింట్ అనే జర్నల్‌లో ‘ముసలితనపు దశ’ పేరుతో... ఓ వ్యాసాన్ని ప్రచురించింది. అందులో... మనుషులు 120-150 ఏళ్ల వరకు కూడా బతకగలరని చెప్పింది. ‘మరణమనేది అంతర్గత బయోలాజికల్ అంశం. అది ఒత్తిడి నుంచి వచ్చే... స్వతంత్రంగా వ్యవహరించే లక్షణం’ అని పేర్కొంది. సింగపూర్‌లో గెరో అనే బయోటెక్ కంపెనీ ఉంది. అది ‘నేచర్ కమ్యూనికేషన్ పాయింట్’ అనే జర్నల్‌లో ‘ముసలితనపు దశ’ అనే పేరుతో... ఓ పరిశోధనా పత్రాన్ని రాసింది.


అందులో... ‘మనుషులు 120-150 ఏళ్ల వరకు కూడా బతకగలరు’ అని చెప్పింది. ‘మరణమన్నది అంతర్గత బయోలాజికల్ అంశం. అది ఒత్తిడి నుంచి వచ్చే... స్వతంత్రంగా వ్యవహరించే లక్షణం’మని పేర్కొంది. ఈ బృందం... మనుషుల్లో ఎర్ర రక్త కణాలను లెక్కిస్తోంది. ఈ క్రమంలో... అమెరికా, బ్రిటన్, రష్యా దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి ఆరోగ్య డేటాను సేకరిస్తోంది. ముసలితనం రావడమనేది... అన్ని దేశాల ప్రజల్లోనూ ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉంటోందని తెలిపింది. ఇందుకు అనేక కారణాలుంటున్నాయని తన నివేదికలో పేర్కొంది. ఈ బృందం... మనుషుల్లో ఎర్ర రక్త కణాలను కౌంట్ చేస్తోంది. 


 తిమోతీ వి పిర్కోవ్ బృందం... తమ అధ్యయనంలో తెలుసుకున్నవిషయం... వయసు పెరిగే కొద్దీ వ్యాధులతోపాటు ఇంకా చాలా రకాల అంశాలను మనం ముందే గుర్తించవచ్చు. అవే... శరీరంలో రక్తకణాల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఇలా రక్తకణాలు తగ్గిపోయే దశ పూర్తిగా ఆగిపోయేటప్పటికి 120-150 ఏళ్లు అవ్వగలదు. 


గెరోను స్థాపించి... ఈ అధ్యయనంలో సహ రచయితగా ఉన్న పీటర్ ఫెడిచెవ్ దీనిపై సైంటిఫిక్ అమెరికన్‌ సంస్థతో మాట్లాడారు.  ‘చాలా మంది బయాలజిస్టులు రక్తకణాల సంఖ్యను చూస్తున్నారు. అవి తగ్గిపోయే దశలు వేరుగా ఉంటున్నాయి. రక్త కణాలు, తగ్గిపోయే దశలు... ఇవి రెండూ కూడా... భవిష్యత్తులో ఒకే లక్షణాన్ని సూచిస్తున్నాయి. ముసలితనం రావడమనే దానికి ఇవి కారణమవుతున్నాయ’ అని పేర్కొన్నారు. 


ఇక ఈ పరిశోధనలో అత్యంత ఆసక్తి కలిగించిన అంశమేమిటంటే... మనిషిలో ఇలా రక్తకణాల సంఖ్య స్థిరంగా తగ్గడమనేది... 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య మొదలవుతుంది. ఒత్తిడి పెరుగుతుంటే.. దానినుంచి శరీరం బయటపడడమన్నది క్రమంగా కష్టమవుతోంది. అంటే చనిపోయే రక్తకణాల సంఖ్య కంటే... కొత్తగా పుట్టే రక్తకణాల సంఖ్య తక్కువగా ఉంటుందన్నమాట. వయసు పెరిగేకొద్దీ... ఈ గ్యాప్ కూడా పెరుగుతుంది. 


‘వయసు పెరిగేటప్పుడు వచ్చే రోగాలను నయం చేసే చికిత్సలు కొంతవరకు వయసును పెంచగలవే తప్ప, నిజమైన వృద్ధాప్యాన్ని నిరోధించే థెరపీలు అభివృద్ధి జెరిగే వరకూ జీవితకాలాన్ని గరిష్టంగా పెంచలే’మని అమెరికాలోని సహ రచయిత యాండ్రీ గుడ్కోవ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-04T00:52:27+05:30 IST