Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 19 Aug 2022 16:29:25 IST

Bollywood: ఆశలన్నీ SRK, Hrithik, Salman పైనే.. ఈ సినిమాలైనా బాలీవుడ్‌లో కొత్త కళ తెచ్చేనా..?

twitter-iconwatsapp-iconfb-icon

ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ (‘Laal Singh Chaddha), అక్షయ్ కుమార్ (Akshay Kumar) ‘రక్షాబంధన్’ (Raksha Bandhan) బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాలు ఆగస్టు 11న విడుదల కాగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు నిరాశజనకంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్‌లపైనే బాలీవుడ్ ఆశలు పెట్టుకుంది. రాబోయే రోజుల్లో వీరందరి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ చిత్రాలు బాలీవుడ్‌కు కొత్త కళను తీసుకువస్తాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం విడుదల వరకు ఆగాల్సిందే.  

రణ్‌బీర్ కపూర్:

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తాజాగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (‘Brahmastra). ఆలియా భట్ హీరోయిన్‌గా నటించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా ఈ చిత్రం రూపొందింది. దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న పలు భాషల్లో విడుదల కానుంది. 

హృతిక్ రోషన్: 

హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న చిత్రం ‘విక్రమ్ వేద’. సైఫ్‌అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నీరజ్ పాండే స్క్రీన్ ప్లేను అందిస్తున్నాడు. పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్‌లో భారీ విజయం సాధించిన ‘విక్రమ్ వేద’ ను హిందీలో అదే పేరుతో రీమేక్  చేస్తున్నారు. గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. 

షారూఖ్ ఖాన్ :

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటిస్తున్న చిత్రం ‘పఠాన్’. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. షారూఖ్ చివరగా ‘జీరో’ లో కనిపించాడు. నాలుగేళ్ల క్రితం ఈ చిత్రం విడుదలైంది. కింగ్ ఖాన్ కొంచెం విరామం తీసుకుని ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోను భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా గణతంత్ర దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 సల్మాన్ ఖాన్:

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). తాజాగా అతడు నటిస్తున్న చిత్రం ‘టైగర్-3’. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తుంది. మనీశ్ శర్మ తెరకెక్కిస్తున్నాడు. ‘టైగర్’ ప్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం ఇది. రంజాన్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ ప్రాంచైజీలో గతంలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. అందువల్ల ఈ సినిమా బాక్సాఫీస్‌కు వసూళ్ల కళను తీసుకుస్తుందని బాలీవుడ్ ఆశిస్తుంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement