Apr 18 2021 @ 13:46PM

'అఖండ'తో శ్రీకాంత్ ఆ హీరోలా మారగలడా..?

జగపతి బాబు ఫస్ట్ ఇన్నింగ్స్ ఎంత అద్బుతంగా సాగిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో కొన్ని సినిమాలకి శోభన్ బాబు ఆ తర్వాత మళ్ళీ జగపతి బాబు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. జగపతి బాబు మొదటి సినిమా చూసి హీరోగా పనికి రాడన్న వాళ్ళే ఆ తర్వాత గ్రేట్ యాక్టర్ అని ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. హీరోగా చేస్తూనే అంతపురం లాంటి సినిమాలలో గేస్ట్ రోల్ పోషించి తన సత్తా చాటాడు. బాలీవుడ్ బాద్ షా షాఖ్ ఖాన్ కూడా ఒక సన్నివేశం విషయంలో నేను జగపతి బాబులా చేయలేకపోయానని చెప్పాడు. ఎవరికైనా సక్సస్.. ఫెల్యూర్ సహజం. జగపతి కెరీర్‌లో కూడా ఇదే జరిగిందింది. హీరోగా కొంతకాలం జగపతి బాబు సినిమాలని దూరమయ్యాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే హీరోగా అవకాశాలు రాలేదని చెప్పాలి. దాంతో జగపతి బాబు సినిమా కెరీర్ క్లోజ్ అనుకున్న వాళ్ళు .. కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 

అయితే జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ ఎవరు ఊహించని విధంగా మొదలైంది. నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో జగపతి బాబు జితేంద్రగా రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎంతో అద్భుతమైన పాత్రలు చేస్తూ హీరోలకి సమానంగా మళ్ళీ క్రేజ్ సంపాదించుకున్నాడు. కాగా హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న శ్రీకాంత్ కెరీర్ కూడా ఇప్పుడు అంత గొప్పగా లేదని చెప్పాలి. శ్రీకాంత్ వెర్సటైల్ యాక్టర్. కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ రోల్స్ గుర్తింపు తెచ్చుకున్నాడు. 

అందుకే జగపతి బాబు మాదిరిగా ఇప్పుడు శ్రీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 'అఖండ' సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్‌తో శ్రీకాంత్ మరో కోణంలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం గ్యారెంటీ అంటున్నారు. 'శంకర్ దాదా MBBS సినిమాలో మెగాస్టార్‌తో కలిసి ఏటీఎం పాత్రలో ఎంతగా మెప్పించాడో తెలిసిందే. అలాగే 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో కూడా చరణ్ బాబాయ్‌గా మంచి పాత్ర చేశాడు. చూడాలి మరి 'అఖండ' శ్రీకాంత్ కెరీర్‌ని ఎటువైపు తీసుకు వెళుతుందో.